Sri Lanka Crisis: లంకలో భారత ప్రభుత్వాధికారికి తీవ్ర గాయాలు

20 Jul, 2022 10:42 IST|Sakshi

కొలంబో: శ్రీలంకలోని కొలంబో సమీపంలో గతరాత్రి జరిగిన అనుహ్య దాడిలో భారత ప్రభుత్వాధికారి తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు కొలంబోలోని భారత హైకమిషన్‌ లంకలోని తాజా పరిణామాల గురించి భారతీయులు ఎప్పటికప్పుడూ తెలుసుకుంటూ.. తదనుగుణంగా రాకపోకలు, కార్యకలాపాలు సాగించాలని కోరింది. అదీగాక శ్రీలంకలో ఏర్పడిన తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా రాజకీయ అనిశ్చితి ఏర్పడింది.

దీనికి తోడు ప్రజలు అసహనంతో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. దీంతో తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్న రణిల్‌ విక్రమసింఘే లంకలో ఎంమర్జెన్సీని కూడా విధించారు. అందువల్ల లంకలో ఉన్న భారతీయలు అప్రమత్తమై ఉండాలని భారత హైకమిషన్‌ సూచించింది. అంతేగాక తీవ్రంగా గాయపడిన ప్రభుత్వాధికారి, భారత్‌ వీసా సెంటర్‌ డైరెక్టర్‌ వివేక్‌ వర్మను భారత హైకమిషన్‌ అధికారులు పరామర్శించినట్లు ట్విట్టర్‌లో పేర్కొంది. మరోవైపు లంకలో బుధవారం అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నందున ఎలాంటి హింసాత్మక ప్రభుత్వ నిరసనలను అనుమతించవదని విక్రమసింఘే భద్రతా బలగాలను కోరారు. 

(చదవండి: Sri Lanka Presidential Election: శ్రీలంక అధ్యక్ష బరిలో ముగ్గురు.. విక్రమ సింఘేకే అవకాశం!)

మరిన్ని వార్తలు