ఫిలిప్పీన్స్‌ను కుదిపేస్తున్న ‘వామ్‌కో’

13 Nov, 2020 04:14 IST|Sakshi
మనీలా శివారులోని మరికినాలో రబ్బరు బోట్ల ద్వారా ప్రజలను తరలిస్తున్న సహాయక సిబ్బంది

ఆరుగురు మృతి, 10 మంది గల్లంతు

మనీలా: భారీ తుపాన్లతో ఫిలిప్పీన్స్‌ అతలాకుతలం అవుతోంది. పది రోజుల క్రితం తీవ్రమైన గోని తుపానుతో ప్రభావితమైన క్వెజాన్, లుజాన్, రిజల్, మనీలా ప్రాంతంలోనే తాజాగా మరో తుపాను వామ్‌కోతో ప్రజలు వణికి పోతున్నారు. ఇప్పటి వరకు ఆరుగురు మరణించగా మరో 10 మంది గల్లంతయ్యారు. సుమారు 2 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారని సీఎన్‌ఎన్‌ తెలిపింది. కేవలం మూడు వారాల్లోనే ఫిలిప్పీన్స్‌పై ఐదు తుపాన్లు తీవ్ర ప్రభావం చూపాయి. గోని తుపాను కారణంగా నిరాశ్రయులైన 2.40 లక్షల మంది ఇప్పటికే తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నట్లు రెడ్‌ క్రాస్, రెడ్‌ క్రిసెంట్‌ తెలిపాయి.
 

మరిన్ని వార్తలు