Top 10 Telugu News: టాప్‌ 10 తెలుగు ట్రెండింగ్‌ న్యూస్‌.. ఒక్క క్లిక్‌తో

11 May, 2022 16:42 IST|Sakshi

1. సంచలనం.. మారిటల్‌ రేప్‌పై భిన్న తీర్పులు!వేర్వేరు ఆదేశాలిచ్చిన జడ్జిలు
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తీర్పు ఇవాళ రానే వచ్చింది. అయితే మారిటల్‌ రేప్‌ (వైవాహిక అత్యాచారం)పై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు ఇవాళ భిన్న తీర్పులు వెలువరించారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ప్రాణాల కోసం పోరాడుతున్న మాజీ మిస్టర్‌ యూనివర్స్‌.. ఆవేదనలో ఫ్యాన్స్‌
బాడీ బిల్డర్‌, మాజీ మిస్టర్‌ యూనివర్స్‌ కాలమ్‌ వాన్‌ మోగర్‌ ప్రాణాలతో పోరాడుతున్నారు. మోగర్‌ ప్రమాదం నుంచి బయటపడాలని, తర్వాగా కోలుకోవాలని ఆయన అభిమానులు దేవుడిని వేడుకుంటున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. హై అలర్ట్‌గా ఉండాలి.. సీఎం జగన్‌ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌
తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సహాయక చర్యలపై సమీక్ష జరిపారు. ఇప్పటికే తొమ్మిది ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను జిల్లాలకు ప్రభుత్వం పంపింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. వాహనదారులపై భారీగా పెరిగిన జీవిత కాలం పన్ను
కొత్త వాహనాలపై జీవితకాల పన్ను బాదుడు మొదలైంది. ఇది సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు రవాణా శాఖ ప్రకటించింది. మొదటి రోజు సుమారు రెండు వేల వాహనాలు నమోదు కాగా.. రెండో రోజు మంగళవారం మరో 1600 వాహనాలు కొత్తగా నమోదయ్యాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. అల్‌ జజీర్‌ మహిళా జర్నలిస్ట్‌ను చంపిన ఇజ్రాయిల్‌ దళాలు
ఇజ్రాయిల్ ద‌ళాలు జరిపన దాడిలో మహిళా రిపోర్టర్ షిరీన్ అబూ అలేహ్‌ మృతి చెందింది. వివరాల ప్రకారం.. పాల‌స్తీనా భూభాగంలో ప‌నిచేస్తున్న తమ రిపోర్టర్‌ షిరీన్‌ను ఇజ్రాయిల్ ద‌ళాలు హ‌త‌మార్చిన‌ట్లు అల్‌ జజీరా సంస్థ పేర్కొంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. సీఎస్‌కే, రవీంద్ర జడేజా మధ్య విబేధాలు.. ఎస్‌ఆర్‌హెచ్‌ బాటలోనేనా!
సీఎస్‌కే యాజమాన్యం, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాల మధ్య విబేధాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ధోని స్థానంలో జట్టును నడిపించడంలో విఫలమైన జడ్డూపై సీఎస్కే గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఈ వ్యాధి వల్ల తీవ్ర నొప్పి, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..
ఐదు పదుల వయసులో కూడా ఇప్పటికీ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచీలర్‌గా పిలిపించుకుంటున్నాడు సల్మాన్‌ ఖాన్‌. ఆయన ఫిట్‌నెస్‌కు ఎంతటి ప్రాధాన్యత ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయనకు కండల వీరుడు అనే బిరుదు వచ్చింది. సల్మాన్‌ ఓ వింత వ్యాధితో బాధపడుతున్నాడట.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. హెచ్‌ఆర్‌ ఎంతో ప్రతిభావంతులు.. కానీ జీతం దగ్గర మాత్రం..
హెచ్‌ఆర్‌ పని తీరు ఎలా ఉంటుంది. కార్పోరేట్‌ వరల్డ్‌లో వారి పాత్ర ఎలా ఉంటోందో ఆర్‌పీజీ గ్రూప్‌ చైర్మన్‌ హర్ష్‌గోయెంకా సరదాగా ట్విటర్‌లో స్వామి హర్షానంద అవతారంలో వివరించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. ఆ 24 సీట్లు కోసమే ప్రతిపక్షాలు పోరాడాలి: కొడాలి నాని
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. చంద్రబాబు తన కొడుకు, మనవడిని ఇంగ్లీష్‌ మీడియం చదివిస్తుంటే.. పేద ప్రజలకు ఇంగ్లీష్‌ మీడియం అందకుండా కోర్టులకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ‘టమాటో ఫ్లూ’ కలకలం.. చిన్నారుల్లో శరవేగంగా వ్యాపిస్తున్న వైనం
మరో అంతుచిక్కని వ్యాధి కలకలం మొదలైంది. కేరళలో  వెలుగు చూసిన టమాటో ఫ్లూ గురించి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగతిన వ్యాపిస్తున్న ఈ ఇన్‌ఫెక్షన్‌.. ఇప్పటిదాకా సుమారు 80 మంది చిన్నారులకు పైనే సోకింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు