Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

10 Apr, 2022 09:57 IST|Sakshi

అందరి బంధువయా రామయ్యా
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్‌ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో విష్ణుమూర్తి ఏడవ అవతారంగా త్రేతాయుగంలో జన్మించాడు. 

AP: కొత్త మంత్రివర్గంలోకి 15 మంది కొత్తవారు!
దాదాపు మూడేళ్ల తరవాత పునర్వ్యవస్థీకరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రివర్గంలోకి 15 మంది కొత్తవారు రాబోతున్నారు. ఇప్పటిదాకా ఉన్న కేబినెట్‌ నుంచి 10 మంది వరకూ... ఆయా జిల్లాల అవసరాలు, సామాజిక కూర్పు, అనుభవం ఆధారంగా ఇకపైనా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇమ్రాన్‌ ఖాన్‌ క్లీన్‌ బౌల్డ్‌.. హై డ్రామా ఓవర్‌
అనేక నాటకీయ పరిణామాల మధ్య పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం ముగిసింది. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పదవిని కోల్పోయారు. శనివారం పాక్‌ జాతీయ అసెంబ్లీ అనేక  వాయిదా పర్వాల మధ్య ఎట్టకేలకు ఇమ్రాన్‌కు గట్టి షాక్‌ తగిలింది. 

ముంబై మళ్లీ ఓడింది! ఆర్సీబీ హ్యాట్రిక్‌ కొట్టింది!
ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ ఓటమి తర్వాత కోలుకున్న బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ (ఆర్‌సీబీ) వరుసగా మూడో విజయాన్ని అందుకోగా... ఐదుసార్లు ముంబై ఇండియన్స్‌ వరుసగా నాలుగో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది.

యుద్ధ నేరాలకు... సాక్ష్యాలివిగో
రైల్వే స్టేషన్‌పై క్షిపణి దాడితో 50 మందికి పైగా అమాయకులను పొట్టన పెట్టుకున్న రష్యాపై మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలను ఉక్రెయిన్‌ కోరింది. బుచాను తలపించే ఈ మారణకాండకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను బాధ్యున్ని చేసి తీరాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు.

‘గాలి నాగేశ్వరరావు’ సందడి మళ్లీ మొదలైంది
గాలి నాగేశ్వరరావు (మంచు విష్ణు చేస్తున్న పాత్ర పేరు) సందడి హైదరాబాద్‌లో మళ్లీ మొదలైంది. మంచు విష్ణు, పాయల్‌ రాజ్‌పుత్, సన్నీ లియోన్‌ ప్రధాన తారాగణంగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 

AP: మంత్రి ఎవరు?, కానిదెవరు?
అమాత్య పదవులపై  రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి పెరిగింది మంత్రి యోగం ఎవరికంటూ సామాన్య ప్రజలు సైతం ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులకు ఫోన్ల తాకిడి పెరిగింది. మంత్రి పదవులనూ బెట్టింగ్‌ రాయుళ్లు వదలడం లేదు. జోరుగా పందాలు కాస్తున్నారు.

మాయావతికి సీఎం పోస్ట్‌ ఆఫర్‌ చేశాం
బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్‌పీ) అధినేత్రి మాయావతిపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదించినా ఆమె స్పందించలేదన్నారు.

ఉచిత పథకాలపై నిర్ణయం ఓటర్లదే
 ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలు సంబంధిత పార్టీకి చెందిన విధానపరమైన నిర్ణయాలేనని ఎన్నికల సంఘం(ఈసీ) తెలి యజేసింది. 

మూడు రోజుల క్రితమే పెళ్లి..వధువు ఆత్మహత్య
చెన్నై ఆవడిలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ నవ వధువు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. చెన్నై ఆవడి గోవర్ధనగిరి నగర్‌కు చెందిన ఉదయ (24) ఎంబీఏ పూర్తి చేసి పూందమల్లి సమీపం కాట్టుపాక్కంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు.


 

మరిన్ని వార్తలు