Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

24 Apr, 2022 10:00 IST|Sakshi

అప్పుల కుప్ప శ్రీలంక.. అంతా రాజపక్సల మాయ!
శ్రీలంకలో సంక్షోభం మొదలై నెల దాటుతోంది. ప్రజాగ్రహం నానాటికీ పెరుగుతోందే తప్ప చల్లారడం లేదు. రాజపక్స కుటుంబమంతా రాజీనామా చేయాలని నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆ ఒక్క డిమాండ్‌తోనే నిరసనకారులు రోజుల తరబడి అధ్యక్ష భవనం ఎదుట బైఠాయిస్తున్నారు.

జరిమానా విధించినందుకు ఎస్‌ఐ గొంతు కోశాడు.. సీఎం పరామర్శ
మద్యం మత్తులో వాహనం నడిపిన తనకు దేహశుద్ధి చేయడమే కాకుండా జరిమానా విధించిన మహిళా ఎస్‌ఐపై వాహనదారుడు కక్ష కట్టాడు. భద్రతా విధులలో ఉన్న ఆమెను వెంటాడాడు. పథకం ప్రకారం  గొంతు కోసి తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులకు చిక్కాడు.

ఢిల్లీలో డేంజర్‌ బెల్స్‌
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వారంలో ఆర్‌–వేల్యూ 2.1ని దాటిందని ఐఐటీ మద్రాస్‌ అంచనా వేసింది. జాతీయ స్థాయిలో ఇది 1.3 మాత్రమేనని తెలిపింది. 

దేశానికి స్ఫూర్తిదాయకంగా ఆంధ్రప్రదేశ్‌ సాగు విధానాలు
రైతు భరోసా కేంద్రం... ఓ విప్లవం. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు.. వేటికీ ఊరు దాటివెళ్లాల్సిన పనిలేకుండా... ఆఖరికి పంట విక్రయానికి కూడా అక్కరకొచ్చేలా ఊళ్లో వెలసిన సేద్యాలయం. రైతాంగం స్థితిగతుల్ని సమూలంగా మార్చే శక్తి కలిగిన ఈ ఆర్బీకే.. యావత్తు దేశానికీ ఓ రోల్‌మోడల్‌.

చెప్పేది గాంధీ సూక్తులు.. కొలిచేది గాడ్సేను
దేశంలో ఎవరైనా నోరు తెరిస్తే.. వారిపై మతం పేరిట ఎదురుదాడులు, అణచివేతకు ప్రధాని మోదీ పూనుకుంటున్నారు. తెలం గాణ మంత్రిగా, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా చెప్తున్నా.. నరేంద్ర మోదీ గాడ్సే వర్షిపర్‌ (గాడ్సే ఆరాధకుడు). చెప్పేది గాంధీ సూక్తులు, కొలిచేది గాడ్సేను. నాపై కేసులు పెడతారా పెట్టండి.

జగన్‌ మానియాను చూసి పవన్‌కు మతిపోయింది
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జనరంజక పాలనతో ప్రజల్లో అపరిమిత అభిమానాన్ని పొందారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా చెప్పారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనలో జనసేన కార్యకర్తలే జై జగన్‌ అంటూ ఇచ్చిన నినాదాలు ఇందుకు నిదర్శనమన్నారు.

40 గంటలు నిద్ర లేకుండా షూటింగ్‌ చేశాను: చిరంజీవి
చిరంజీవి ఇంకా అర్ధాకలితోనే ఉన్నారు.. ఇంకా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పంచభక్ష్య పరమాన్నాలు ఉన్న సెలబ్రిటీకి ఆకలా? మెత్తటి పరుపులు ఉన్న స్టార్‌కి నిద్ర లేని రాత్రులా? ఎందుకు? నటన మీద ఉన్న ఆకలి అది.. వృత్తి మీద ఉన్న ప్రేమ అది.. అందుకే మూడు నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు మెగాస్టార్‌.

IPL 2022: ఎదురులేని ఎస్‌ఆర్‌హెచ్‌.. ఐపీఎల్‌ చరిత్రలో అరుదైన రికార్డు
ఐపీఎల్‌ 2022లో శనివారం రాత్రి ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇది వరుసగా ఐదో విజయం కావడం విశేషం. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసి పాత ఎస్‌ఆర్‌హెచ్‌ను గుర్తుచేసిన జట్టు.. ఒక్కసారిగా ఫుంజుకుంది.

నెగ్గిన అమెజాన్‌ పంతం..! రూ. 24 వేల కోట్ల డీల్‌ను రద్దు చేసుకున్న రిలయన్స్‌..
రిలయన్స్‌– ఫ్యూచర్‌ గ్రూప్‌ మధ్య 21 నెలల క్రితం కుదిరిన ఒప్పందానికి తెరపడింది. ఫ్యూచర్‌ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్‌ రిటైల్, ఇతర లిస్టెడ్‌ కంపెనీలకు చెందిన సెక్యూర్డ్‌ క్రెడిటార్స్‌ ఈ డీల్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడం తెలిసిందే. దీంతో ఒప్పందం అమలు అసాధ్యమని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ శనివారం స్పష్టం చేసింది.

అత్యంత ప్రత్యేకం.. ప్రళయమొచ్చినా.. లైట్‌ తీసుకుంటాయ్‌!
జీవులేవైనా నీరు, ఆహారం వంటివి లేకుండా కొద్దిరోజులు కూడా బతకలేవు. గాలి లేకుంటే కొద్ది నిమిషాలైనా ప్రాణంతో ఉండలేవు. కానీ కంటికి సరిగా కనిపించని ఓ రకం జీవులు మాత్రం.. నీళ్లు, ఆహారం లేకున్నా ఏళ్లకేళ్లు బతికేస్తాయి. అవే టార్డిగ్రేడ్‌లు. చూడటానికి ఎలుగుబంట్లలా ఉంటాయి కాబట్టి ‘వాటర్‌ బేర్‌’ అని కూడా పిలుస్తుంటారు. మరి ఏమిటీ జీవులు, వాటి ప్రత్యేకతలేమిటో తెలుసుకుందామా?

మరిన్ని వార్తలు