5 ఏళ్ల పాప... ఆడుకుంటుంది అనుకున్న తల్లికి ఊహించని షాకిచ్చింది!

4 Apr, 2023 17:44 IST|Sakshi

ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్య కాలంలో చిన్నారులు ఆట బొమ్మలకంటే స్మార్ట్‌ఫోన్లతోనే కాలంక్షేపం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు బొమ్మలతో ఆడుకున్నట్లే ఫోన్లతో ఆడుకుంటున్నారని లైట్‌ తీసుకుంటున్నారు. ఆ తర్వాత జరిగే పరిణామాలను చూసి కంగుతింటున్నారు. తాజాగా ఓ ఐదేళ్ల చిన్నారి తన తల్లికి  ఊహించని షాకిచ్చింది. ఈ ఘటన అమెరికాలో వెలుగు చూసింది. 

మసాచుసెట్స్‌కి చెందిన జెస్సికా నూన్స్ అనే మహిళ కారులో వెళ్తుండగా తన ఐదేళ్ల కూతురు లీల గోల చేస్తూ ఉంది. దీంతో పాపకి తన ఫోన్‌ ఇవ్వడంతో సైలెంట్‌ అయ్యింది. అయితే ఫోన్‌లో గేమ్స్‌, లేదా వీడియోలు చూస్తూ ఉందేమో అని జెసికా అనుకుంది. అయితే లీలా మాత్రం అమెజాన్‌ యాప్ ఓపెన్ అందులో 3,180 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.2.46 లక్షల) బొమ్మలను ఆర్డర్‌ చేసింది.

లీలా ఆర్డర్‌ చేసిన బొమ్మలలో.. 10 మోటార్‌సైకిళ్ల బొమ్మలు, ఒక జీప్ బొమ్మ, 10 జతల ఉమెన్స్ కౌగర్ల్ బూట్లు ఉన్నాయి. బైక్‌లు, జీప్ ఆర్డర్లు కలిపి 3,180 డాలర్లు ఉండగా... అందులో బూట్లే సుమారు 600 డాలర్లు ఉన్నాయి. మోటార్‌సైకిళ్లు, బూట్ల ఆర్డర్‌లలో సగం క్యాన్సిల్‌ చేసినప్పటికీ, అప్పటికే డెలివరీ చేసిన ఐదు మోటార్‌సైకిళ్లు, ఒక పిల్లల జీప్‌ను ఆమె ఆపలేకపోయింది. వీడియో గేమ్‌లు లేదా షాపింగ్ యాప్‌ల కోసం పిల్లల తల్లిదండ్రులకు తెలియకుండా ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం ఇదే మొదటిసారి కాదు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

మరిన్ని వార్తలు