ఘోర ప్రమాదం.. రెండు మెట్రో రైళ్లు ఢీ

16 Dec, 2023 08:29 IST|Sakshi

బీజింగ్: చైనాలో ఘోర ప్రమాదం జరిగింది.  రాజధాని బీజింగ్‌లో రెండు మెట్రో రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 515 మంది గాయపడ్డారు. 102 మంది పరిస్థితి తీవ్రంగా ఉందని అధికారులు తెలిపారు. అయితే.. ఈ ఘటనలో ఇప్పటికైతే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. 

నిత్యం రద్దీగా ఉండే బీజింగ్‌లో మెట్రో రైళ్లు క్షణం గడువు లేకుండా నడుస్తుంటాయి. నగరంలో 27 రైల్వే లైన్లలో ప్రతిరోజూ 13 మిలియన్ల మంది ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి రెండు నిమిషాలకో రైలు నడుస్తుంది. బీజింగ్‌లో శుక్రవారం భారీగా మంచు కురిసింది. రైల్వే ట్రాక్‌లు తడిసి ఉన్నాయి. ఈ క్రమంలో సబ్‌వే వద్ద ఓ రైలు బ్రేక్ వేసింది. వెనకనే వస్తున్న రైలు బ్రేక్ వేయడంలో విఫలమైన నేపథ్యంలో రెండు రైళ్లు ఢీ కొన్నాయని బీజింగ్ మున్సిపల్ అధికారులు తెలిపారు.

రెండు రైళ్లు ఢీకొనడంతో ప్రయాణికులు ఒక్కసారిగా కుదుపుకు గురయ్యారు. చెల్లాచెదురుగా పడిపోయామని స్థానికులు తెలిపారు. కొందరు ఎముకలు విరిగి ఆర్తనాదాలు చేసినట్లు వెల్లడించారు. మొత్తంగా 515 మంది గాయపడగా ఆస్పత్రికి తరలించారు. 102 మందికి ఎముకలు విరిగి పరిస్థితి తీవ్రంగా ఉందని వెైద్యులు తెలిపారు.  

ఇదీ చదవండి: వెనెజులాలో ట్రక్కు బీభత్సం.. 16 మంది మృతి

>
మరిన్ని వార్తలు