లండన్‌లో నిరసనలు...కింగ్‌ చార్లెస్‌ ముఖంపై కేక్‌ విసిరి...

25 Oct, 2022 10:13 IST|Sakshi

లండన్‌లో ఆయిల్‌ స్టాప్‌ అంటూ నిరసనలు వెలువెత్తాయి. ఈ నిరసనల నేపథ్యంలోనే లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లోని కింగ్‌ చార్లెస్‌ 3 మైనపు విగ్రహాన్ని ఇద్దరు వాతావరణ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ప్రస్తుతం లండన్‌ ప్రభుత్వం కొత్త చమురు, గ్యాస్‌ లైసెన్స్‌లు అనుమతివ్వడంపై పలు ప్రాంతాల్లో వాతావరణ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేయడం ప్రారంభించారు.

అందులో భాగంగానే ఇద్దరు వాతావరణ కార్యకర్తలు తాము ధరించిన నల్లని చొక్కాలను తీసేసి ...జస్ట్‌ స్టాప్‌ ఆయిల్‌ అని రాసి ఉన్న టీ షర్ట్‌లను ధరించి కింగ్‌ చార్లెస్‌ మైనపు విగ్రహం ముంఖంపై చాక్లెట్‌ కేక్‌ విసిరి తమ నిరసనను వ్యక్తం చేశారు. అంతేగాదు ఆ నిరసకారులు ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ....ప్రభుత్వం ఆదేశించిన అన్ని కొత్త చమురు, గ్యాస్ లైసెన్స్‌లను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు

దీంతో ఈ ఘటనపై స్పందించిన మెట్రోపాలిటన్‌ పోలీసులు నిరసకారులు నలుగురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఇటీవల గత కొద్ది రోజులుగా లండన్‌లో పలు చోట్ల ఈ జస్ట్‌ స్టాప్‌ ఆయిల్‌ నిరసనలు అధికమయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది. 

(చదవండి: అమెరికా వైట్‌హౌస్‌లో అంగరంగ వైభవంగా దీపావళి: వీడియో వైరల్‌)

మరిన్ని వార్తలు