‘ట్రంప్‌ ఎన్నికల’తో చరిత్ర తిరగబడేనా?

28 Oct, 2020 16:43 IST|Sakshi

అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్‌ 3న జరగనున్న ఎన్నికల్లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఓడిపోయినట్లయితే అమెరికా ఎన్నికల చరిత్ర తిరగబడినట్లే. దేశాధ్యక్షుడు రెండో సారి ఓడిపోవడం గత 28 ఏళ్లలో ఇదే మొదటి సారి అవుతుంది. 28 ఏళ్ల క్రితం అంటే, 1992లో బిల్‌ క్లింటన్‌ చేతుల్లో నాటి అధ్యక్షుడు జార్జి హెచ్‌డబ్లూ బుష్‌ ఓడిపోయారు. ఆ మాటకొస్లే 231 ఏళ్ల అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో 45 మంది దేశాధ్యక్షుల్లో కేవలం పది మంది మాత్రమే రెండోసారి విజయం సాధించకుండా పరాజయం పాలయింది. (అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకపాత్ర పోషించేదిదే..!)

ప్రపంచంలోని పలు ప్రజాస్వామ్య దేశాల్లోలాగానే అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా అసమ్మతి ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఎక్కువగానే ఉంటుంది. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో ట్రంప్‌ ప్రభుత్వం విఫలమైందని, ఆయన నిర్లక్ష్యమే అందుకు కారణమని అమెరికా ఓటర్లు భావిస్తున్నారు. అమెరికా వందేళ్ల చరిత్రలో 25 సార్లు అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగ్గా 11 సార్లు పాలకపక్ష పార్టీ అభ్యర్థే విజయం సాధించారు. అందులో ఆరుసార్లు డెమోక్రట్లు, ఐదుసార్లు రిపబ్లికన్లు గెలిచారు. ఇక భారత్‌లో 17 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరగ్గా, అందులో ఏడు ఎన్నికల్లో పాలకపక్ష పార్టీ లేదా సంయుక్త కూటములు ఓడి పోయాయి. అలాగే బ్రిటన్‌కు జరిగిన ఎన్నికల్లో 27 సార్లకుగాను పది సార్లు పాలకపక్షం ఓడిపోయింది. (మరో వివాదంలో ట్రంప్ : ఎవరా మహిళ?)

అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో 78 శాతం మంది పాలకపక్షం అభ్యర్థులే విజయం సాధించారు. అదే ప్రస్తుత ఎన్నికల్లో ట్రంప్‌కు కలసొచ్చే అంశం అని విశ్లేషకులు భావిస్తుండగా, అసమ్మతి పవనాలు బలంగా వీస్తున్నప్పుడు పాలకపక్ష అభ్యర్థులు ఓడి పోవడం కూడా అంతే సహజమని వారు భావిస్తున్నారు. ట్రంప్‌ ఇటీల సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ అమీ కోని నియమించడం ఆయనకు కలసొచ్చే అంశం. నియామకంతో సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్యలో రిపబ్లికన్లు–డెమోక్రట్ల బలం 6–3 నిష్పత్తికి చేరుకుంది. 2000 సంవత్సరంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఫ్లోరిడా విషయంలో ‘బుష్‌ వర్సెస్‌ గోర్‌’ వివాదం ఎలా చెలరేగిందో ట్రంప్, బైడెన్‌ విషయంలో అలాంటి వివాదమే ఏర్పడుతోందని, అప్పుడు సుప్రీం కోర్టు సానుకూల వైఖరి కారణంగా ట్రంప్‌ విజయం సాధిస్తారని విశ్లేషిస్తున్న వారు కూడా లేకపోలేదు. (పెద్దన్న ఎన్నిక ఇలా..)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా