సిరియాలో ఇరాన్‌ స్థావరాలపై అమెరికా దాడులు!

27 Oct, 2023 10:04 IST|Sakshi

సిరియాలో ఇరాన్‌ స్థావరాలపై అమెరికా సైన్యం వైమానిక దాడులకు దిగింది. దీనిని అమెరికా రక్షణ విభాగం ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ బలగాలపై దాడులకు ప్రతిగానే ఈ దాడులు చేపట్టామని, ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ దాని అనుబంధ విభాగాలు ఈ స్థావరాల్ని ఉపయోగించుకుంటున్నాయని అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్‌ ఆస్టిన్‌ తెలిపారు. 

ఇరాక్‌, సిరియాలో ఉన్న అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని అక్టోబర్‌ 17 నుంచి ఇరాన్‌ ప్రోత్సాహక ఉగ్ర సంస్థలు వరుస దాడులకు పాల్పడుతున్నాయి.  ఈ దాడులు హమాస్‌, ఇస్లామిక్‌ జిహాద్‌, హిజ్బుల్లా పనేనని అమెరికా అనుమానిస్తోంది. ప్రతిదాడుల్లో భాగంగానే తాజా దాడులు జరిపినట్లు ప్రకటించింది అమెరికా. అయితే ఇజ్రాయెల్‌-హమాస్‌ సంక్షోభానికి, ఈ దాడులకు ఎలాంటి సంబంధం లేదని ఆస్టిన్‌ స్పష్టం చేశారు.

అమెరికా ట్రూప్‌లపై దాడులు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధ్యక్షుడు జో బైడెన్‌.. ఇరాన్‌ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమైనీకి గురువారం నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రకటన వెలువడి రోజు గడవక ముందే సిరియాలోని ఇరాన్‌ స్థావరాల్ని అమెరికా లక్ష్యంగా చేసుకోవడం విశేషం. 

మరిన్ని వార్తలు