అనుకోని అతిథి.. ఎక్కడివారక్కడే గప్‌చుప్‌

30 Oct, 2020 10:13 IST|Sakshi

బ్లూమ్‌ఫౌంటైన్‌: దక్షిణాఫ్రికాలోని ఓ రెస్టారెంట్‌కు వచ్చిన అనుకొని అతిథిని చూసి అందరూ ఒక్కసారిగా కంగుతిన్నారు. అది రెస్టారెంట్‌ అంతా తిరుగుతుంటే దాని కంటపడకుండా ఉండేందు అందులో ఉన్నవారంతా ఎక్కడివారు అక్కడ గప్‌చుప్‌ అయిపోయి బిక్కుబిక్కుమంటు భయంతో దిక్కులు చూస్తున్నారు. ఇంతకి ఆ అనుకొని అతిధి ఎవరంటే చిరుత పులి. దక్షిణాఫ్రికాలోని సాబీ సాండ్స్ గేమ్ రిజర్వ్‌లోని సింగిటా ఎబోనీ లాడ్జ్‌లో చిరుతపులి తిరుగుతున్న ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను క్రుగర్ సైటింగ్స్ యూట్యూబ్‌లో షేర్ చేశాడు. గత వారం షేర్‌ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా వ్యూస్‌ సంపాదించింది. ఇందులో చిరుత రెస్టారెంట్‌ అంతా తిరుగుతూ ఉంటే.. కస్టమర్లంతా ఎక్కడి వారు అక్కడ సైలెంట్‌గా ఉండిపోయారు. (చదవండి: జంతువులు నేర్పిన పాఠం.. వీడియో వైరల్‌)

అక్కడి టెబుల్‌, కుర్చీల చాటున దాక్కుని అందులోని వారంతా ఒకరిఒకరు సైగ చేసుకుంటూ అలర్ట్‌ అవుతున్నారు. చిరుత నుంచి తప్పించుకునే దారి లేక ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని చూస్తున్నారు. కానీ చిరుత మాత్రం దర్జాగా రెస్టారెంట్‌లో షికారు చేసి చివరకు అక్కడ ఎదురుగా ఉన్న మెట్లు ఎక్కి ఎగువ డెక్‌ నుంచి పొదల్లోకి వెళ్లిపోయింది. దీనిపై కస్టమర్‌ ఒకరు స్పందిస్తూ... ‘చిరుపులిని దగ్గరగా చూడటం నిజంగా అరుదైన అనుభవం. నమ్మలేకపోతున్నా. దాన్ని అలా చూసిన తర్వాత ప్రాణాలతో భయటపడతాం అనుకోలేదు. కానీ వన్యమృగాలకు, మనుషులకు మధ్య సామరస్యత ఉంటుందని ఈ సంఘటన రుజువు చేసింది. నిజంగా అది లోపలికి రాగానే అందరం ప్రాణభయంతో దిక్కులు చూస్తున్నాము. కానీ అది మాత్రం దానికదే మెల్లిగా బయటకు వెళ్లిపోయింద’న్నారు. ఆ చిరుత ఎవరిపై దాడి చేయడలేదని రెస్టారెంట్‌ యాజమాన్యం స్ఫష్టం చేసింది. (చదవండి: చిరుత, పైథాన్‌ ఫైట్‌.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా