అన్న సీఐఎస్‌ఎఫ్‌.. చెల్లి సీఆర్పీఎఫ్‌

21 Aug, 2023 09:58 IST|Sakshi

కరీంనగర్: వ్యసాయం మీదనే ఆ కుటుంబం ఆధారపడి బతుకుతోంది. కానీ వారి పిల్ల లను మాత్రం కేంద్ర బలగాలకు పంపాలనుకున్నారు. పిల్లలు కూడా తల్లిదండ్రుల కలలను సాకారం చేశారు. మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అన్నాచెల్లెలు సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్పీఫ్‌కు ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన పోతుల ప్రభాకర్‌–రాజమణి కూతురు పోతుల స్రవంతి పదోవ తరగతి వరకు స్థానిక మోడల్‌ స్కూల్‌లో విద్యనభ్యసించిది.

జమ్మికుంటలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి ఇటీవల సీఆర్ఫీఎఫ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకుంది. ఆదివారం విడుదలైన ఫలితాలలో కానిస్టేబుల్‌గా ఎంపికై ంది. అంతకుముందు ఎస్సైకి దరఖాస్తు చేసుకోగా విఫలమైంది. కానీ సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించింది. అదేవిధంగా పోతుల స్రవంతి చిన్నాన పోతుల చంద్రయ్య–ఇందిరల కుమారుడు పోతుల శ్రావణ్‌ కూడా సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు.

శ్రావణ్‌ పదో తరగతి వరకు స్థానిక మోడల్‌ స్కూల్లో చదివాడు. అనంతరం బాసర ట్రిపుల్‌ ఐటీలో ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. ఇద్దరు ఒకే కుటుంబం నుంచి కేంద్ర సాయుధ బలగాలకు ఎంపిక అవ్వడం పట్ల గ్రామస్తులు వారిని అభినందించారు. ఇద్దరు ఒకేసారి దరఖాస్తు చేసుకున్నారు, కోచింగ్‌కు వెళ్లకుండా ఇంటి వద్దనే ఈవెంట్స్‌కు ప్రిపేర్‌ అయ్యారు.

మరిన్ని వార్తలు