దత్తతపై అవగాహన ఉండాలి | Sakshi
Sakshi News home page

దత్తతపై అవగాహన ఉండాలి

Published Wed, Nov 22 2023 12:18 AM

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పతి - Sakshi

కరీంనగర్‌: ప్రభుత్వ నిబంధనల ప్రకారమే దత్తత తీసుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జాతీయ దత్తత నెల అవగహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంతానం లేని దంపతులు పిల్లలను దత్తత తీసుకొని, వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరారు. దత్తత మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారానే జరగాలని, ఈ విధానంపై అందరికీ అవగాహన ఉండాలన్నారు. ఇందుకోసం ఏటా నవంబర్‌ను ప్రభుత్వం దత్తత నెలగా ప్రకటించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ హోమ్స్‌లో ఉన్న పిల్లలందరినీ గుర్తించి, దత్తత ఇవ్వడం, తీసుకునేవారికి పిల్లల పోషణ, దత్తత విధానంపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్‌ ధనలక్ష్మి, సభ్యులు అర్చన, విజయ్‌, డీసీపీవో శాంత, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098 జిల్లా కో–ఆర్డినేటర్‌ సంపత్‌, పీవోఎన్‌ఐసీ తిరుపతి, ఎల్‌సీపీవో రాజు, శిశు గృహ సోషల్‌ వర్కర్‌ రాజేశ్‌, సఖి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ పమేలా సత్పతి

Advertisement
Advertisement