-

పోటీ పరీక్షలు విద్యార్థుల నైపుణ్యానికి దోహదం

27 Nov, 2023 00:12 IST|Sakshi
సావనీర్‌ ఆవిష్కరిస్తున్న జూనియర్‌ సివిల్‌ జడ్జి సరళ రేఖ

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): ప్రస్తుతకాలంలో పోటీపరీక్షలతో విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొంది ఉన్నతస్థాయికి ఎదుగుతారని 3వ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి సరళరేఖ అన్నారు. ఆదివారం సిద్ధార్థ స్కూల్‌ చైర్మన్‌ దివంగత దాసరి నర్సింహారెడ్డి స్మారకర్థం పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి క్విజోన్‌–2023 ప్రిలిమినరీని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఇలాంటి పరీక్షలతో విద్యార్థులలో పోటీతత్వం అలవడుతుందని అన్నారు. సిద్ధార్థ విద్యాసంస్థల డైరెక్టర్‌ దాసరి శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ సంవత్సరం క్విజోన్‌ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరు గ్రూపులను ఫైనల్‌ రౌండ్‌కు ఎంపిక చేసి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన గ్రూప్‌లకు నగదు పారితోషికాలు అందించనున్నట్లు తెలిపారు. అనంతరం పాఠశాలకు చెందిన సావనీర్‌ను జూనియర్‌ సివిల్‌ జడ్జి సరళరేఖ ఆవిష్కరించారు.

డ్రోన్లు, స్కై బెలూన్‌ వినియోగంపై నిషేధం

కరీంనగర్‌ క్రైం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా, భద్రత కారణాల దృష్ట్యా పారాగ్లైడర్స్‌, రిమోట్‌ కంట్రోల్‌ డ్రో న్స్‌, రిమోట్‌ కంట్రోల్‌ మైక్రోలైట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లు స్థానిక ఎస్సారార్‌ గవర్నమెంట్‌ డిగ్రీ కళాశాల గ్రౌండ్‌ నుంచి 12 కిలోమీటర్ల పరిధి వరకు, స్కై ఎయిర్‌ బెలూన్లు కిలోమీటర్‌ పరిధి వరకు వినియోగాన్ని నిషేధించడం జరిగిందని కరీంనగర్‌ సీపీ అభిషేక్‌ మహంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఈనెల 28వ తేదీ ఉదయం 6గంటల వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు