ఎన్నికలు ఎప్పుడు రద్దు చేస్తారంటే.. | Sakshi
Sakshi News home page

ఎన్నికలు ఎప్పుడు రద్దు చేస్తారంటే..

Published Sun, Nov 26 2023 12:08 AM

-

కరీంనగర్‌ అర్బన్‌: ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్‌ 58ఏ ప్రకారం పోలింగ్‌ జరుగుతున్నప్పుడు ఓట్ల లెక్కింపు జరిగినా, డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పార్టీలు, అ భ్యర్థులు ప్రయత్నించినా.. ఆ ఎన్నికలను ర ద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఏదైనా ఎన్నికను రద్దు చేయాలంటే రా జ్యాంగంలోని 324 అధికరణ, జనరల్‌ క్లాజెస్‌ యాక్ట్‌ 1897లోని సెక్షన్‌ 21 ప్రకారం.. రాష్ట్రపతికి ఎన్నికల సంఘం సిఫార్సు చేస్తుంది. దాన్ని రాష్ట్రపతి పరిశీలించి, ఆమోదిస్తే ఆ ఎన్నిక రద్దవుతుంది.

తమిళనాడులో మూడుసార్లు..

● 2016లో తమిళనాడు శాసనసభ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు పంచుతున్నారన్న కారణంతో అరవకురిచి, తంజావూరు నియోజకవర్గాల్లో ఎన్నికలను ఎలక్షన్‌ కమిషన్‌ రద్దు చేసింది.

● అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం 2017లో ఆర్కేనగర్‌ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు పంచుతున్నారని ఆ ఎన్నికను ఎలక్షన్‌ కమిషన్‌ రద్దు చేసింది.

● 2019లో తమిళనాడులోని వేలూరు లోక్‌సభ నియోజకవర్గంలో డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆ ఎన్నికను ఈసీ రద్దు చేసింది. డబ్బు పంపిణీ కారణంగా దేశంలో రద్దయిన తొలి లోక్‌సభ నియోజకవర్గ ఎన్నిక ఇదే.

నలుగురి బైండోవర్‌

జమ్మికుంట(హుజూరాబాద్‌): నలుగురు వ్యక్తులను శనివారం తహసీల్దార్‌ రజని ఎదుట బైండోవర్‌ చేసినట్లు జమ్మికుంట పట్టణ సీఐ రమేశ్‌ తెలిపారు. ఎన్నికల నియమావళిలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జమ్మికుంట మండలంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులను బైండోవర్‌ చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement