వివాహమైన రెండేళ్లకే నూరేళ్లు! అనాథగా తొమ్మిదినెలల కుమారుడు..

19 Dec, 2023 10:28 IST|Sakshi
మౌనిక (ఫైల్‌)

అదనపు కట్నం తేవాలని హింసించిన అత్తామామ

అత్తింటి వేధింపులో వివాహిత ఆత్మహత్య

కరీంనగర్: అదనపు కట్నం తేవాలనే అత్తామామల వేధింపులు భరించలేక పెద్దపల్లి జిల్లా మన్మంతునిపేట గ్రామానికి చెందిన గోగుల మౌనిక ఉరఫ్‌ తీగల సాధన(25) సోమవారం వేకువజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివాహమైన రెండేళ్లకే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టడంతో ఆమె తొమ్మిది నెలల కుమారుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఎస్సై మల్లేశ్‌ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన గోగుల మౌనిక ఉరఫ్‌ తీగల సాధనను రెండేళ్ల క్రితం పెద్దపల్లి మండలం హన్మంతునిపేటకు చెందిన తీగల రాజ్‌కుమార్‌కు ఇచ్చి వివాహం జరిపించారు.

ఆ సమయంలో రూ.7లక్షల నగదు, పల్సర్‌బైక్‌ కట్నంగా ఇచ్చినట్లు మౌనిక తల్లి గోగుల సమ్మక్క తెలిపారు. ఆ తర్వాత కూడా అదనంగా కట్నం తేవాలంటూ తమ కూతురును భర్త రాజ్‌కుమార్‌, అత్త, మామ యశోద, పోచాలు వేధించేవారని కన్నీటి పర్యంతమైంది. తరచూ కొంత మొత్తాన్ని వారికి ఇచ్చామని పేర్కొన్నారు. మళ్లీ రూ.2లక్షలు తేవాలంటూ వేధించడంతో మౌనిక ఈనెల13న పుట్టింటికి వచ్చిందన్నారు. ఇటీవలే భర్తతో మాట్లాడించి మళ్లీ అత్తింటికి పంపించామని అన్నారు. ఈక్రమంలో సోమవారం వేకువజామున మౌనిక ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు భర్త రాజ్‌కుమార్‌, అత్త, మామలు యశోద, పోచాలుపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ మహేశ్‌ తెలిపారు.

ముఖ్య గమని​క: ​​​ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
ఇవి చ‌ద‌వండి: ఫోన్ల వేటలో పోలీసులు భళా! కానీ 'బండి' విష‌యంలో..??

>
మరిన్ని వార్తలు