బంగారు నాణేలంటూ రూ.40 లక్షలు మస్కా

7 Oct, 2023 10:13 IST|Sakshi

కర్ణాటక: ఇంటి నిర్మాణానికి పునాది తీస్తుండగా పురాతన బంగారు నాణేలు దొరికాయని నమ్మించి కాంట్రాక్టర్‌కు రూ.40 లక్షలు మోసం చేసిన ఘటన దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకా లింగదహళ్లి గ్రామంలో జరిగింది. ఈ విషయం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరు గ్రామీణ జిల్లా దేవనహళ్లి తాలూకా చీమనహళ్లికి చెందిన కాంట్రాక్టర్‌ గోవర్ధన్‌ బాధితుడు. కుమార్‌, మాదకప్ప అనే ఇద్దరు పునాది తీస్తుండగా బంగారు నాణేలు దొరికాయని గోవర్ధన్‌ను మభ్యపెట్టారు

. ఈయన చన్నగిరి తాలూకాలో కాంట్రాక్ట్‌ పనులు చేసే సమయంలో వీరిద్దరూ పరిచయమయ్యారు. నిజమేననుకున్న అతడు సెప్టెంబర్‌ 23న వారికి రూ. 40 లక్షలు ముట్టజెప్పారు. వారు 2.5 కేజీల బరువైన నాణేలను అతనికి ఇచ్చారు. అదృష్టమంటే నాదేననే సంతోషంతో గోవర్ధన్‌ ఒక బంగారు అంగడికి వెళ్లి వాటిని పరీక్షింపజేశాడు. అవి బంగారు నాణేలు కాదని తేలింది. దీంతో బాధితుడు చన్నగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులిద్దరూ పరారీలో ఉన్నట్లు ఎస్‌ఐ నిరంజన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు