Sakshi News home page

10 వేల మంది బంగ్లాదేశ్‌ అక్రమ వలసదారులు

Published Sat, Nov 11 2023 1:22 AM

-

బనశంకరి: బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో దాదాపు 10 వేల మంది బంగ్లాదేశ్‌ వలసదారులు మకాంవేసినట్లు ఎన్‌ఐఏ అధికారుల దర్యాప్తులో వెలుగుచూసింది. బెంగళూరు నగరంలోని కృష్ణరాజపురం, సోలదేవనహళ్లి, బెళ్లందూరు, బయప్పనహళ్లి, గ్రామాంతరలోని దొడ్డబళ్లాపుర, హొసకోటే, అనేకల్‌తో రామనగర పాటు 15 ప్రాంతాల్లో రెండు రోజులక్రితం ఎన్‌ఐఏ దాడులు చేసి అక్కడ మకాం వేసిన బంగ్లాదేశీయులపై దాడిచేసి అక్రమ వలసలను ప్రోత్సహిస్తున్న 11 మందిని అరెస్ట్‌ చేశారు. మాస్టర్‌మైండ్‌ జాకీర్‌హుసేన్‌ సూచనమేరకు బెంగళూరు నగరానికి బంగ్లాదేశీయులను రప్పిస్తున్నట్లు విచారణలో తేలింది. 10 వేలమందికి పైగా అక్రమంగా వచ్చి బెంగళూరు తో పాటు వివిధ ప్రాంతాల్లో మకాం వేసినట్లు దర్యాప్తులో వెలుగు చూసింది. కాగా ఎన్‌ఐఏ దాడిసమయంలో చాలామంది బంగ్లాదేశ్‌ వలదారుల వద్ద ఆధార్‌ కార్డు, ఓటర్లు గుర్తింపుకార్డులు లభించాయి. ఆ కార్డులు ఎవరు అందిస్తున్నారన్న విషయంపై ఎన్‌ఐఏ కూపీ లాగుతోంది. అక్రమ వలసదారుల్లో కొంతమంది దోపిడీలకు పథకం రచించారని, మరికొందరు వేశ్యావాటికలో దందా నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది.

బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో మకాం

ఎన్‌ఐఏ దర్యాప్తులో వెలుగులోకి

Advertisement

What’s your opinion

Advertisement