రోజూ ఇదే తతంగం సార్‌ !

20 Oct, 2023 10:13 IST|Sakshi
తన కారులో నుంచి బస్సును గమనిస్తున్న ఎమ్మెల్యే

బాగేపల్లి: ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు నిర్వహణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అవి ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోవడం సహజమే. గురువారం ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే తన కారులో వస్తూ నిలిచిపోయిన ఆర్టీసీ బస్సును గమనించి అవాక్కయ్యారు. బాగేపల్లి తాలూకా పాతపాళ్య రోడ్డులో ఉదయం ఎమ్మెల్యే కారులో వస్తుండగా ఓ ఆర్టీసీ బస్సును ప్రయాణికులు తోస్తూ కనిపించారు.

వెంటనే ఎమ్మెల్యే కారు దిగి బస్సు డ్రైవర్‌ను పిలిపించి మాట్లాడారు. బస్సుకు రంగులు వేసి కొత్తగా ఉన్నా ఇంజిన్‌లో పసలేదని డ్రైవర్‌ ఎమ్మెల్యే ఎదుట వాపోయాడు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. దీంతో ఎమ్మెల్యే సుబ్బారెడ్డి మాట్లాడుతూ త్వరలో డిపోకు వచ్చి బస్సుల పరిస్థితిలపై చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 

మరిన్ని వార్తలు