భక్తుల కొంగు బంగారం సాయిబాబా

17 Nov, 2023 01:06 IST|Sakshi
మంత్రి బోసురాజును సన్మానిస్తున్న అభిమానులు

రాయచూరు రూరల్‌: భక్తుల కొంగు బంగారం షిర్డీ సాయిబాబా అని చిన్న నీటిపారుదల, విజ్ఞాన సాంకేతిక శాఖా మంత్రి ఎన్‌.ఎస్‌.బోసురాజు పేర్కొన్నారు. ఆయన గురువారం నగరంలోని సాయిబాబా ఆలయంలో తనను అభిమానులు సన్మానించిన సందర్భంగా మాట్లాడారు. దేవుడిపై భక్తిశ్రద్ధలతో భక్తులు విశ్వాసంతో పూజించినప్పుడే మనస్సుకు శాంతి కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా సీనియర్‌ కాంగ్రెస్‌ నేత శివమూర్తి ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో రుద్రప్ప, జయన్న, ప్రవీణ్‌, ఈరణ్ణ, బసవరాజ్‌, రవి, దినేష్‌, దేవేంద్రలున్నారు.

నేత్ర ఆస్పత్రి సేవలు అనన్యం

నగరంలో ఎం.ఎం.జోషి నేత్ర ఆస్పత్రి వైద్య సేవలు అనన్యమని మంత్రి ఎన్‌.ఎస్‌.బోసురాజు, ఎంపీ రాజా అమరేశ్వర నాయక్‌ అభిప్రాయపడ్డారు. వారు గురువారం నగరంలోని వెంకటేశ్వర కాలనీలో ఎం.ఎం.జోషి నేత్ర ఆస్పత్రిని ప్రారంభించి ప్రసంగించారు. వైద్య సేవలకు గుర్తింపుగా హుబ్లీలోని ఎం.ఎం.జోషి నేత్ర ఆస్పత్రికి పద్మభూషణ్‌ అవార్డు లభించిందన్నారు. ఆస్పత్రిలో తక్కువ ఖర్చుతో కంటి వైద్య సేవలను అందించాలని సూచించారు. నేత్రదానం శ్రేష్టమన్నారు. మనిషి మరణించిన తర్వాత కళ్లను దానం చేసి నలుగురి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. సమావేశంలో వైద్యులు రవిరాజన్‌, గురు ప్రసాద్‌, శ్రీనివాస్‌, ముల్లా, మహే్‌ష్‌ డోంగ్రె, సంజీవ్‌ కులకర్ణి, సుధా పాటిల్‌, రమేష్‌లున్నారు.

మరిన్ని వార్తలు