పెళ్లికూతురు మిస్సింగ్‌, తండ్రి ఆత్మహత్య

20 Nov, 2023 08:00 IST|Sakshi

మైసూరు: బంధువులతో ఇల్లంతా సందడిగా ఉంది. కొన్ని గంటలు గడిస్తే తలంబ్రాల వేడుక. కానీ అంతలోనే పిడుగులాంటి వార్త వధువు తండ్రి చెవిన పడింది. పెళ్లికూతురు ప్రియునితో వెళ్లిపోయింది, ఇది తట్టుకోలేక ఆవేదనతో ఆమె తండ్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటె తాలూకాలోని హొరదహళ్లి గ్రామంలో జరిగింది.

ఏం జరిగిందంటే..
వివరాలు.. పుట్టేగౌడ (55) కుమార్తె అయిన సుచిత్రకు ఈ నెల 18, 19వ తేదీన గుండ్లుపేటెలోని రామమందిరంలో పెళ్లి నిశ్చయించారు. కానీ ఈ నెల 17వ తేదీన సుచిత్ర తన ప్రియునితో వెళ్లిపోయింది. ఫలితంగా పెళ్లి ఆగిపోయింది. ఈ అవమానభారాన్ని పుట్టేగౌడ తట్టుకోలేకపోయాడు. శనివారం పొలానికి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలించగా చెట్టుకు వేలాడుతూ మృతదేహం కనిపించింది. తరకనాంబి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఇల్లు వరుస విషాదాలతో కన్నీటి సంద్రమైంది.

మరిన్ని వార్తలు