నేత్రపర్వంగా శ్రీనివాస కల్యాణం

20 Nov, 2023 00:30 IST|Sakshi
కల్యాణోత్సవం నిర్వహించిన దృశ్యం

బొమ్మనహళ్లి: బెంగళూరులోని బొమ్మనహళ్లి పరిధిలోకి వచ్చే హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌ అటల్‌ బిహారి వాజ్‌ పాయ్‌ క్రీడా మైదానంలో హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌ శ్రీశ్రీనివాస కల్యాణోత్సవ సమితి 14వ ఏడాది శ్రీనివాస కల్యాణం శనివారం రాత్రి నేత్రపర్వంగా సాగింది. బొమ్మనహళ్లితోపాటు చుట్టుపక్కల ప్రాంతాలనుంచ వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారి కల్యాణాన్ని వీక్షించి పులకించిపోయారు. శ్రీవాదిరాజ్‌ రాయచూరు, శ్రీనివాస ఉత్సవ సమితి, బెంగళూరు నగరం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో డాక్టర్‌ రాయచూరు శేషగిరిరావ్‌, విదూషి శుభ సంతోష్‌ ఆలపించిన భక్తిగేయాలు భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి. ఉడుపికి చెందిన శ్రీగోపాలాచార్‌లు స్వామి వారి కల్యాణోత్సవ విశిష్టతను భక్తులకు వివరించారు. స్వామివారి కల్యాణం భక్తులకు తిరుపతి లడ్డూలను ప్రసాదంగా పంపిణీ చేశారు. బొమ్మనహళ్లి ఎమ్మెల్యే ఎం. సతీష్‌ రెడ్డి, కల్యాణోత్సవ సమితి కమిటీ సభ్యులు ప్రొఫెస్‌ సదాశివరెడ్డి, నారాయణ స్వామి, శ్రీధర్‌ రెడ్డి, అనిల్‌ ఎస్‌. రెడ్డి, జయరామ రెడ్డి, కే.వాసుదేవ, మాజీ కార్పొరేటర్‌, గురుమూర్తి రెడ్డి, ఆరోగ్య స్థాయి సమితి మాజీ అధ్యక్షుడు వేణుగోపాల్‌ రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు