జూరాలకు స్వల్ప ఇన్‌ఫ్లో

10 Nov, 2023 09:14 IST|Sakshi

ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గురువారం రాత్రి 8 గంటల వరకు ప్రాజెక్టుకు 1,980 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 78 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 920 క్యూసెక్కులు, కుడి కాల్వకు 731 క్యూసెక్కులు, ఆర్‌డీఎస్‌ లింక్‌ కెనాల్‌కు 300 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 2,044 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీట్టిం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 6.340 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

రామన్‌పాడుకు 1,140 క్యూసెక్కులు
మదనాపురం: జూరాల ఎడమ కాల్వ నుంచి రామన్‌పాడు జలాశయానికి 1,140 ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. గురువారం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 1,020 అడుగులకు వచ్చి చేరింది. రామన్‌పాడు నుంచి ఎన్‌టీఆర్‌ కాల్వ ద్వారా వ్యవసాయ అవసరాలకు 1,150, కుడి కాల్వకు 10, ఎడమ కాల్వకు 10 క్యూసెక్కులు విడుదల చేయడంతో పాటు తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ఏఈ రనిల్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు