విరిగిన 15 స్తంభాలు, 4 ట్రాన్స్‌ఫార్మర్లు

14 Nov, 2023 08:29 IST|Sakshi
అన్నారెడ్డిపల్లిలో చెరుకు లారీ తగిలి కూలిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ స్తంభాలు

చెరుకు లారీ తీగలకు తగలడంతోసంఘటన

విద్యుత్‌ సరఫరా లేకపోవడంతోతప్పిన పెను ప్రమాదం

మహబూబ్‌నగర్‌: రైతు పొలం నుంచి చెరుకు లోడ్‌తో వెళ్తున్న లారీకి విద్యుత్‌ స్తంభాల తీగలు తగిలి వరుసగా నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లు దిమ్మెల పైనుంచి కింద పడి, స్తంభాలు విరిగిన సంఘటన మహమ్మదాబాద్‌ మండలంలో చోటుచేసకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని అన్నారెడ్డిలో ఓ రైతు పొలంలో చెరుకు కోసుకుని లారీకి లోడ్‌ చేశారు.

అటు నుంచి రోడ్డుపైకి వచ్చి వెళ్తున్న లారీకి పైనున్న విద్యుత్‌ తీగలు తగిలాయి. గమనించకుండా లారీని తోలడంతో 15 విద్యుత్‌ స్తంభాలు, 4 ట్రాన్స్‌ఫార్మర్లు కిందపడిపోయాయి. దీంతో 20 మంది రైతుల వరకు బోరుమోటార్లు నడవకుండా నిలిచిపోయాయి. ఆ సమయంలో విద్యుత్‌ లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లోని రైతులకు పెనుప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలియజేశారు. విద్యుత్‌ అధికారులు వెంటనే స్పందించి విద్యుత్‌ లైన్‌ పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు