నగదు, మద్యం తరలింపుపై ప్రత్యేక దృష్టి | Sakshi
Sakshi News home page

నగదు, మద్యం తరలింపుపై ప్రత్యేక దృష్టి

Published Tue, Nov 14 2023 1:38 AM

- - Sakshi

బాలానగర్‌: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం అక్రమ తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకుడు సంజయ్‌కమార్‌ మిశ్ర అన్నారు. బాలానగర్‌ మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన స్టాటిస్టిక్స్‌ సర్వేలెన్స్‌ బృందం తనిఖీ కేంద్రాన్ని సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీ ఇతర వివరాలపై ఆరా తీశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి మద్యం, నగదు తరలిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.

నగదు సీజ్‌

అమరచింత: మండలంలోని మస్తీపురం క్రాస్‌రోడ్డులో ఆదివారం ఎస్‌ఎస్‌టీ టీం–6 ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఆత్మకూర్‌ మండలం జూరాలకు చెందిన కుర్వ నర్సింహులు రూ.3లక్షల 80వేల నగదు తరలిస్తుండగా, పట్టుకుని నారాయణపేట గ్రీవేన్స్‌ సెల్‌కు పంపించినట్లు ఎస్‌ఐ జగన్మోహన్‌ తెలిపారు. ఎస్‌ఎస్‌టీ టీం లీడర్‌ ఆంజనేయులు, హెడ్‌కానిస్టేబుల్‌ వలీ ఉన్నారు.

కృష్ణా: మండలంలోని చేగుంట చెక్‌పోస్టు వద్ద సోమవారం ఎస్‌ఐ విజయభాస్కర్‌ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. యాద్గీర్‌ పట్టణానికి చెందిన కిరణ్‌ తన కారులో రూ.లక్ష 90వేల నగదును తరలిస్తుండగా, పట్టుకుని నారాయణపేట గ్రీవెన్స్‌ కమిటీకి పంపించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement