మనం సినిమా తీస్తున్నాం!

6 Sep, 2022 04:10 IST|Sakshi

‘చేస్తాను.. నేను యాక్ట్‌ చేస్తాను’ అంటూ కృతీ శెట్టి ఫోన్‌లో సుధీర్‌బాబుతో మాట్లాతున్న సీన్‌తో మొదలవుతుంది ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా ట్రైలర్‌. సుధీర్‌బాబు, కృతీ శెట్టి జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. గాజులపల్లె సుధీర్‌బాబు సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్‌ మార్క్‌ స్టూడియోస్‌ పతాకాలపై బి. మహేంద్రబాబు, కిరణ్‌ బల్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు హీరో మహేశ్‌బాబు.

‘నేను ఈ సినిమా ఇక చేయలేనేమో అనిపిస్తుంది’ అన్న కృతీ శెట్టి డైలాగ్, ‘మనం సినిమా తీస్తున్నాం అని అనుకుంటుంటాం కానీ అప్పుడప్పుడు సినిమాయే మనల్ని తీస్తుంటుంది’ అనే సుధీర్‌బాబు డైలాగ్స్‌తో ట్రైలర్‌ సాగుతుంది. ‘‘అలేఖ్య (కృతీ పాత్ర)కు నటి కావాలనే ఆశ ఉన్నప్పటికీ ఆమె తల్లిదండ్రులు పూర్తి వ్యతిరేకం. అలేఖ్య ఆశ ఫైనల్‌గా ఏమైంది? ఇందుకు ఆ సినిమా దర్శకుడు (సుధీర్‌బాబు పాత్ర) ఏం చేశాడు? అనే అంశాల ఆధారంగా కథ సాగుతుంది’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: వివేక్‌ సాగర్‌.

మరిన్ని వార్తలు