Vijay Devarakonda: 'భవిష్యత్తులో మరో మహిళకు ఇలా జరగొద్దు'.. రష్మిక వీడియోపై విజయ్ దేవరకొండ!

8 Nov, 2023 18:59 IST|Sakshi

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియోపై సినీ తారలు స్పందిస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోపై అమితాబ్ బచ్చన్, నాగ చైతన్య, మా అధ్యక్షుడు మంచు విష్ణు ఖండిస్తూ పోస్టులు పెట్టారు. తాజాగా రష్మిక మార్ఫింగ్ వీడియోపై టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ రియాక్ట్ అయ్యారు. ఇలాంటి వారిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. 

(ఇది చదవండి: రష్మిక ఫేక్ వీడియో ఘటన.. 'మా' అధ్యక్షుడి రియాక్షన్)

విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ..  'భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. మరో మహిళకు ఇలా జరగకూడదు. వీటిపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకునేలా ప్రత్యేక సైబర్ విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ఇలాంటి దారుణాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి. అప్పుడే మహిళలకు పూర్తి రక్షణ ఉంటుంది.' అంటూ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. కాగా.. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న కేంద్రం సోషల్ మీడియాలో ఇలాంటి నేరాలను అరికట్టేందుకు హెచ్చరికలు జారీ చేసింది. 

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఇలాంటి వీడియోలను 36 గంటల్లోగా తొలగించాలని.. ఎక్కడా కనిపించకూడదంటూ కేంద్రం ఆదేశాలిచ్చింది. నిబంధనలను గుర్తు చేస్తూ ఓ అడ్వయిజరీని జారీ చేసింది. డీప్‌ఫేక్‌ వంటి వీడియోలు క్రియేషన్‌, సర్క్యులేషన్‌కు సంబంధించిన పెనాల్టీలు, నిబంధనలు గుర్తు చేస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ మంత్రిత్వ శాఖ ఆయా సోషల్‌మీడియా సంస్థలకు అడ్వయిజరీని పంపించింది. 

(ఇది చదవండి: ఓటీటీకి మా ఊరి పొలిమేర-2.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)


 

మరిన్ని వార్తలు