మరోసారి లీడ్‌ రోల్స్‌లో అభిషేక్‌, నిత్యామీనన్‌‌‌

29 Mar, 2021 10:20 IST|Sakshi

‘బ్రీత్‌’ వెబ్‌సిరీస్‌ మూడో సీజన్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ‘బ్రీత్‌’ తొలి భాగంలో మాధవన్‌ నటించగా, రెండో సీజన్‌  ‘బ్రీత్‌: ఇన్‌  టు ది షాడోస్‌’లో అభిషేక్‌ బచ్చన్, నిత్యామీనన్‌  లీడ్‌ రోల్స్‌ చేశారు. ఇప్పుడు ఈ బ్రీత్‌ వెబ్‌ సిరీస్‌ మూడో సీజన్‌కు సంబంధించిన షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ‘‘బ్రీత్‌’ సిరీస్‌ డైరెక్టర్‌ మయాంక్‌ శర్మ థర్డ్‌ సీజన్‌  కోసం ఆల్రెడీ స్క్రిప్ట్‌ను లాక్‌ చేశారు. సెకండ్‌ పార్టులో నటించిన అభిషేక్, నిత్యాయే ‘బ్రీత్‌ 3’లో కూడా నటిస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌  వర్క్స్‌ జరుగుతున్నాయి. ‘‘ఈ సిరీస్‌కు సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్‌ను ముంబయ్, ఢిల్లీలో చిత్రీకరించడానికి ప్లాన్‌  చేస్తున్నాం’’ అని ప్రొడక్షన్‌ యూనిట్‌ పేర్కొంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు