మరో తీవ్ర విషాదం, ప్రభాస్‌ ‘సాహో’ నటుడు మృతి

1 May, 2021 16:25 IST|Sakshi

సినీ పరిశ్రమలో కరోనా అంతులేని విషాదాన్ని నింపుతోంది. గత వారం రోజులుగా చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటినటులు, దర్శక-నిర్మాతలు మహమ్మారితో పోరాడి ఒడుతున్నారు. తాజాగా మరో టాలెంటెడ్‌ నటుడు కరోనాతో మృత్యు ఒడికి చేరారు. ఇటీవల కరోనా బారిన పడిన ప్రముఖ హిందీ నటుడు బిక్రమ్‌జీత్‌ కన్వర్‌పాల్‌ ఇవాళ(మే 1) మృతి చెందడంతో బాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతి చెందినట్లు దర్శకుడు అశోక్‌ పండిత్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.

‘అతి చిన్న వయసులోనే బిక్రమ్‌ జీత్‌ మనందరిని విడిచి వెళ్లిపోవడం నన్ను తీవ్రంగా కలచివేస్తోంది’ అంటూ భావోద్యేగానికి లోనయ్యారు. ఆయన మరణ వార్త విని బాలీవుడ్‌ సినీ ప్రముఖులతో పాటు తెలుగు నటీనటులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలుపుతున్నారు. రిటైర్డ్‌ ఆర్జీ మేజర్‌ బిక్రమ్‌ 2003లో నటుడిగా కెరీర్‌ను ప్రారంభించారు. హిందీలో ఎన్నో సినిమాలు, సీరియళ్లు, వెబ్‌సిరీస్‌ల్లో సహా నటుడిగా నటించి టాలెంటెడ్‌ యాక్టర్‌గా తనకుంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక తెలుగులో రామ్‌చరణ్‌ ‘జంజీర్’‌, రానా ‘ఘాజీ అటాక్’‌, ప్రభాస్‌ ‘సాహో’  వంటి పాన్‌ ఇండియా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులయ్యారు.  

చదవండి: 
యువ నటుడికి కరోనా, ఐసీయూకు మార్చిన వైద్యులు
‘ఈ నీతులు నీ కజిన్‌ రణ్‌బీర్‌కు చెప్పండి మేడం’

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు