-

ప్రముఖ డైరెక్టర్‌తో ప్రభు కూతురి పెళ్లి ఫిక్స్‌

28 Nov, 2023 12:57 IST|Sakshi

సౌత్‌ ఇండియాలో ప్రముఖ నటుడిగా ప్రభు కొనసాగుతున్నారు. హీరోగా మొదలైన ఆయన కెరియర్‌ ప్రస్తుతం తండ్రి పాత్రలలో పలు చిత్రాల్లో నటిస్తూ ఆయన బిజీగా ఉన్నారు. ప్రభుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.  విక్రమ్ అనే కుమారుడితో పాటు ఐశ్వర్య అనే కుమార్తె ఉన్నారు. ఆయన కుమారుడు విక్రమ్ కూడా తమిళ చిత్రసీమలో చెప్పుకోదగ్గ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆయన నటించిన  'ఇరుకప్పపుట్టు' అనే చిత్రం ఇటీవల విడుదలైంది. ఆ సినిమా  ప్రేక్షకుల ఆదరణ కూడా పొందింది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో స్నేహితుడిలా ఐశ్వర్యకు  పరిచయం అయ్యాడు డైరెక్టర్‌ అధిక్‌ రవిచంద్రన్‌. వారి స్నేహం కాస్త ప్రేమగా మారి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఇశ్వర్యకు ఇది రెండో పెళ్లి. 2009లో తన బంధువైన కునాల్‌తో ఆమెకు వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఐశ్వర్య తన భర్త కునాల్‌తో కలిసి అమెరికాలో స్థిరపడింది. భర్తతో కొన్ని విభేదాల కారణంగా విడాకులు ఇచ్చి ప్రస్తుతం తన తల్లిదండ్రులతో ఉంటుంది. ఈ క్రమంలో తన సోదరుడి చిత్రం షూటింగ్‌ జరుగుతున్న సమయంలో  దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌తో స్నేహం ఏర్పడటం.. అది కాస్త ప్రేమగా మారిందని తెలుస్తోంది. జివి ప్రకాష్ కుమార్ నటించిన 'త్రిష ఇల్లనా నయనతార' సినిమాతో అధిక్ రవిచంద్రన్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం అక్కడ క్రేజీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు.

ఇటీవ‌ల అధిక్‌ రవిచంద్రన్‌ డైరెక్ట్‌ చేసిన `మార్క్ ఆంటోని` సినిమా మంచి విజ‌యం సాధించింది. ఇందులో విశాల్, ఎస్.జె.సూర్య నటించారు. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు కలెక్ట్‌ చేసి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. దీంతో కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్ 63వ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించే ఛాన్స్‌ దక్కింది. అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు. ఈ పరిస్థితిలో ఇటీవలే అధిక్ రవిచంద్రన్, ప్రభు కూతురు ఐశ్వర్యల నిశ్చితార్థం జరిగిందని, డిసెంబర్‌ 15న పెళ్లి జరగనుందని సమాచారం. త్వరలోనే ప్రభు తరఫు నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుందని కూడా అంటున్నారు.

మరిన్ని వార్తలు