-

OTT Movie: ఒకరోజు ముందే ఓటీటీలోకి హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే!

28 Nov, 2023 16:49 IST|Sakshi

థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కాకపోతే స్టార్స్ ఎవరూ లేకపోవడంతో ఎందుకో ప్రేక్షకులకు పెద్దగా రీచ్ కాలేదు. దీంతో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు. అయితే చెప్పిన టైమ్ కంటే ముందే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందుకు రిలీజైంది?

సినిమా సంగతేంటి?
2020లో తమిళంలో రిలీజై, హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా 'మండేలా'. దాదాపు మూడేళ్ల తర్వాత దీన్ని తెలుగులో 'మార్టిన్ లూథర్ కింగ్' పేరుతో రీమేక్ చేశారు. సంపూర్ణేశ్ బాబు ప్రధాన పాత్రలో నటించాడు. అక్టోబరు 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది గానీ కలెక్షన్స్ రాబట్టంలో కాస్త వెనకబడిపోయింది. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 25 సినిమాలు)

ఓటీటీలో స్ట్రీమింగ్
దీంతో 'మార్టిన్ లూథర్ కింగ్' మూవీ డిజిటల్ హక్కులు దక్కించుకున్న సోనీ లివ్ సంస్థ.. నవంబరు 29న ఓటీటీలో రిలీజ్ చేస్తామని ప్రకటించింది. మరి ఏమైందో ఏమో గానీ ఓ రోజు ముందే ఓటీటీలోకి తీసుకొచ్చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం అందుబాటులో ఉంది.

కథేంటి?
పడమరపాడు అనే ఊరు. ప్రెసిడెంట్‌‌కి ఇద్దరు కొడుకులు. పెద్ద భార్య కొడుకు జగ్గు(వీకే నరేశ్‌), చిన్న భార్య కొడుకు లోకి(వెంకట్‌ మహా) ఎప్పుడూ గొడవపడుతూనే ఉంటారు. పలు సమస్యలతో బాధపడుతున్న ఈ ఊరికి ఓ పెద్ద ఫ్యాక్టరీ వస్తుంది. కోట్లల్లో కమీషన్‌ వస్తుందని తెలిసి.. జగ్గు, లోకి ఇద్దరూ ప్రెసిడెంట్‌ పదవి కోసం పోటీ పడతారు. ఉత్తరం వాళ్లు, దక్షిణం వాళ్లు సమానంగా ఉండడంతో.. ఒక్క ఓటు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లే ప్రెసిడెంట్ అయ్యే అవకాశముంటుంది. ఆ ఒక్క ఓటే స్మైల్‌ అలియాస్‌ మార్టిన్‌ లూథర్‌ కింగ్‌(సంపూర్ణేష్‌ బాబు)ది. ఇతడి ఓటు కీలకం కావడంతో జగ్గు, లోకి.. కింగ్‌కి కావాల్సినవన్నీ ఇస్తారు. మరి తన ఓటుని అడ్డుపెట్టుకొని కింగ్‌ ఎలాంటి కోరికలు తీర్చుకున్నాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? చివరకు తన ఓటు హక్కుతో ఊరి సమస్యలను ఎలా తీర్చాడు అనేదే మిగతా కథ. 

(ఇదీ చదవండి: లవర్‌ని పరిచయం చేసిన 'జబర్దస్త్' నరేశ్.. కాకపోతే!)

మరిన్ని వార్తలు