Parari Movie: తెలుగు సినిమాకు మరిన్నీ ఆస్కార్ అవార్డులు రావాలి: సుమన్

17 Mar, 2023 20:23 IST|Sakshi

యోగేశ్వర్, అతిథి జంటగా నటిస్తోన్న చిత్రం 'పరారి'. ఈ చిత్రానికి సాయి శివాజీ దర్శకత్వం వహిస్తున్నారు. జీవీవీ గిరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శంకర ఆర్ట్స్ బ్యానర్‌పై  గాలి ప్రత్యూష సమర్పిస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌కు  మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ చిత్రం మార్చి 30న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా సీనియర్ నటులు సుమన్, ప్రసన్న కుమార్, కాంగ్రెస్ లీడర్  అంజన్ కుమార్ యాదవ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. 

సుమన్ మాట్లాడుతూ.. 'మన తెలుగు సినిమాకు ఆస్కార్ వచ్చేలా కృషి చేసిన ఆర్ఆర్ఆర్ టీంకు కంగ్రాట్స్. తెలుగు వారందరూ గర్వించే రోజు. ఇలాగే మన తెలుగు వారు మంచి సినిమాలు తీసి  మరిన్నీ ఆస్కార్ అవార్డులు తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిర్మాత గిరి నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానంటే వద్దని తన కుమారుడిని హీరోగా పరిచయం చేయడం జరిగింది. యోగేష్ చాలా బాగా నటించాడు. ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి.' అని అన్నారు

నటి కవిత మాట్లాడుతూ.. 'ఈ సినిమా పాటలు చాలా బాగున్నాయి. ఇందులో హీరో చాలా చక్కటి నటనను ప్రదర్శించాడు. మంచి కథతో ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న పరారి  చిత్రం గొప్ప విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు.

అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. 'యోగేష్ హీరోగా బాగా నటించారు. గిరి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశారు. మంచి కథతో వస్తున్న ఈ సినిమా యూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్' అని అన్నారు. ఈ చిత్రంలో సుమన్, భూపాల్, శివాని సైని, రఘు కారుమంచి, మకరంద్ దేశముఖ్, షయాజి షిండే, అలీ , శ్రవణ్, కల్పాలత, జీవ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు  హనుమంత రావు(మాజీ రాజ్య సభ) , గాలి అనిల్ కుమార్, రవతు కనకయ్య, పొన్నం ప్రభాకర్, అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు