Rekha Boj: భారత్‌​ గెలుస్తే అంటూ.. 'బోల్డ్‌ ఆఫర్‌' ప్రకటించిన తెలుగు హీరోయిన్‌

16 Nov, 2023 07:48 IST|Sakshi

టీమ్‌ఇండియా వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది. టోర్నీ ప్రారంభం నుంచి అపజయం అనేది లేకుండా వరల్డ్‌ కప్‌-2023లో భారత్‌ జైత్రయాత్ర కొనసాగుతుంది. ఆదివారం  జరిగే ఫైనల్‌ బిగ్‌ఫైట్‌ కోసం భారత్‌ రెడీ అవుతుంది. ఈసారి ప్రపంచ కప్‌ భారత్‌ గెలవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం జట్టులో అందరూ మంచి ఫామ్‌లో ఉండటమే.. ఇలాంటి సమయంలో తెలుగు హీరోయిన్, వైజాగ్ బ్యూటీ రేఖాభోజ్ తన సోషల్‌మీడియా ఖాతా నుంచి సంచలన స్టేట్ మెంట్ ఇచ్చింది. 'ఇండియా వరల్డ్ కప్ కొడితే.. వైజాగ్ బీచ్‌లో స్ట్రీకింగ్ చేస్తా' అంటూ పోస్ట్ పెట్టింది.

స్ట్రీకింగ్ అంటే ఏంటి..?
ఫుట్ బాల్, బ్యాడ్మింటన్, బాక్సింగ్ వంటి ఆటలలో తన జట్టు గెలిచినప్పుడు పట్టరాని ఆనందంలో కొంతమంది దుస్తులు తొలగించి పరుగులు తీస్తుంటారు. అలా  ఒంటిపై బట్టల్లేకుండా పరుగుపెట్టడమే స్ట్రీకింగ్‌​ అంటారు. ఈ కల్చర్‌ ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. తమ అభిమాన జట్టు గెలిచినప్పుడు పట్టరాని ఆనందంతో వారు ఇలాంటి పని చేస్తుంటారు. ఇప్పుడు రేఖా భోజ్‌ కూడా అలాంటి పని చేయనుంది. ఫైనల్‌ మ్యాచ్‌లో ఇండియా గెలవడం కంటే ఆనందం ఏముంటుందని ఆమె తెలుపుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ గెలుస్తే...వైజాక్‌ బీచ్‌లో తన దుస్తులు తొలగించి పరుగెడుతానని ఆమె బోల్డ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది.

ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. ఇండియా గెలుస్తే... బట్టలు విప్పి పరిగెడతావా ఛీ ఛీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గుర్తింపు కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అంటూ ఫైర్‌ అవుతున్నారు. వాటికి రేఖా భోజ్ కూడా ఇలా  రిప్లై  ఇచ్చింది.  లేదండి.. మనస్ఫూర్తిగా ఇండియన్ క్రికెట్ టీమ్‌పై అభిమానంతో చెబుతున్నా. నాకు ఎలాంటి హైప్ అవసరం లేదు. క్రికెట్ మీద అభిమానంతో ఈ పని చేస్తున్నా తప్పితే.. హైప్ కోసం కాదు.' అని రేఖా బోజ్ తెలిపింది. కానీ కొందరు మాత్రం అంతే బోల్డ్‌గా వైజాగ్‌ వచ్చేస్తామంటూ భిన్నంగా కామెంట్లు చేస్తున్నారు.. 

రేఖా భోజ్‌ ఎవరు..?
బోల్డ్‌ సినిమా అయిన మాంగళ్యం, దామినీ విల్లా, కలాయ తస్మై నమః, కాత్సాయని, స్వాతి చినుకు, రంగీలా వంటి సినిమాల్లో నటించింది ఈ వైజాగ్ బ్యూటీ రేఖా భోజ్‌. కానీ ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో వైజాగ్‌లో సొంతంగా స్టూడియో పెట్టుకుని కవర్స్‌ సాంగ్స్‌ చేస్తూ యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్‌పైన కూడా ఆమె గతంలో వైరల్‌ కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే..

విశాఖపట్నంలోని కైలాసపురానికి చెందిన రేఖ సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. చదువుతున్నప్పుడే షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించే అవకాశం వచ్చింది. నటనపై మక్కువతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంది. చదువు పూర్తయిన తర్వాత సినిమా హీరోయిన్‌గా ప్రయత్నాలు మొదలుపెట్టింది. సుమారు 50 వరకు ఆడిషన్స్‌కు వెళ్లింది. అందరూ నయనతారలా ఉన్నావ్‌ అని అన్నారే తప్పితే అవకాశాలు మాత్రం ఎవరూ ఇవ్వలేదు. అలాంటి సమయంలో రాకేష్‌రెడ్డి అనే యువ దర్శకుడు ఆమెకు సినిమా అవకాశం కల్పించాడు. కాలాయ తస్మై నమః సినిమాలో మూకీ పాత్రకు ఎంపిక చేశాడు. అలా మొదలైంది రేఖ భోజ్‌ సినీ ప్రస్థానం.

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు