Upendra-Allu Arjun: బన్నీ అలా అంటాడని ఊహించలేదు

12 Apr, 2022 09:05 IST|Sakshi

Upendra Comments On Allu Arjun In Latest Interview: హీరో ఉపేంద్ర.. ఒకప్పుడు తెలుగులోనూ హీరోగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిద్యమైన కథలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన ఇక్కడ తనదైన మార్క్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు. ప్రస్తుతం సహా నటుడి పాత్రలు చేస్తున్న ఆయన అల్లు అర్జున్‌ ‘సన్నాఫ్‌ సత్యామూర్తి’ చిత్రంలో ప్రతికథానాయకుడిగా కనిపించాడు. తాజాగా గని మూవీలో ఓ కీ రోల్‌ పోషించాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించిన ఆయన అల్లు అర్జున్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

చదవండి: పెద్దపల్లి జిల్లా గొదావరి ఖనిలో నాని మూవీ షూటింగ్‌

ఈ సందర్భంగా ఉపేంద్ర సన్నాఫ్‌ సత్యమూర్తి మూవీని గుర్తు చేసుకున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ సెట్‌లో బన్నీ చాలా సరదాగా ఉండేవాడన్నాడు. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి మూవీ సెట్‌ బన్నీ చాలా యాక్టివ్‌గా ఉండేవాడు. నాకు రోజు ఇంటి నుంచి భోజనం తెప్పించేవాడు. నాకు ఇష్టమైన వంటకాలు ఏవో తెలుసుకుని స్పెషల్‌గా చేయించి తీసుకువచ్చేవాడు. ఆ సినిమా పూర్తయ్యేవరకు బన్నీ నన్ను ఒక గిప్ట్‌లా చూసుకున్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. 

చదవండి: యాంకర్‌ సుమ కొడుకు జోరు, అప్పుడే రెండో సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు!

అలాగే ‘‘ఓ రోజు బన్నీని ఇలా అడిగాను. మీకు అంత్యంత సంతోషాన్ని ఇచ్చేది ఏది.. ఖరీదైన కార్ల? టూర్ల? అని అడిగాను. దానికి అతను ‘అసలు నాకు దేనిపై పెద్దగా ఆసక్తి ఉండదు. నాకు సంతోషాన్ని ఇచ్చేది సినిమాలు మాత్రమే. షూటింగ్‌ ఉంటే నాకు ఆరోజు పండగ రోజులా ఉంటుంది’ అని సమాధానం ఇచ్చాడు’ అని ఉపేంద్ర పేర్కొన్నారు. అనంతరం బన్నీ నోట నుంచి అలాంటి సమాధానం ఊహించలేదని, వర్క్‌ పట్ల అతడు చూపించే అంకితభావం చూసి ఆశ్చర్యం వేసిందన్నాడు. కొత్త ఇండస్ట్రీకి వచ్చేవారు బన్నీని చూసి నేర్చుకోవాలి అని ఉపేంద్ర పేర్కొన్నారు

మరిన్ని వార్తలు