Abhinaya On Marriage Rumours: విశాల్‌తో పెళ్లి వార్తలు.. అలా చేసినందు వల్లే: అభినయ

7 Oct, 2023 11:25 IST|Sakshi

అభినయ .. ఈ పేరు తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో నేనింతే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రాజుగారి గది-2, సీతారామం చిత్రాల్లో నటించింది. ఇటీవలే రిలీజైన విశాల్ మూవీ మార్క్ ఆంటోనీతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. అయితే పుట్టుకతోనే మూగ, చెవిటి అభినయ సినిమాల్లో తన టాలెంట్‌ను నిరూపించుకుంది. తన నటనతో ఎన్నో అవార్డులను సాధించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు తన తండ్రితో కలిసి హాజరైంది. ఆమె తండ్రి అభినయ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు  పంచుకున్నారు. అభినయకు వినపడదు.. అంతే కాదు మాట్లాడలేదు కూడా.. కేవలం సైగల ద్వారానే తన భావాలను వ్యక్తం చేయగలదు. 

(ఇది చదవండి: సడన్‌గా ఓటీటీ మారిన హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

అభినయ తండ్రి ఆనంద్‌ మాట్లాడుతూ.. 'నా కూతురిని మొదట మోడలింగ్ రంగంలో తనను వాళ్ల అమ్మనే చాలా బాగా చూసుకుంది. నేను చాలా కంపెనీల వద్దకు వెళ్తే నాపై కొప్పడ్డారు. ఒక మూగ అమ్మాయిని తీసుకొచ్చి సినిమాల్లో ట్రై చేస్తున్నారు. అతనేమైనా పిచ్చోడా అన్నారు. కానీ నేను దేవుడిపై భారం వేశాను. మాకు గాడ్ ఎవరంటే సముద్రఖని. ఆయన లేకుంటే అభినయ ఈరోజు ఇక్కడ ఉండేది కాదు. మా అమ్మాయి ఇంత అందంగా పుట్టినా.. దేవుడు ఈ ‍ప్రాబ్లమ్ ఇచ్చాడే అనుకున్నాం. మూడేళ్ల వరకు తాను నడవలేదు. చివరికీ హ్యాండీక్యాప్‌  అనుకున్నాం. ఈ రోజు ఏ స్థాయిలో ఉన్న తను అందరితో కలిసిపోతుంది. ' అని అన్నారు. 

అభినయ మాట్లాడుతూ..'తన తల్లిదండ్రులు వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. అన్నింటిలోనూ నన్ను నడిపించేది అమ్మ, నాన్నే. నాకు సంబంధించిన అన్ని విషయాలు చూసుకుంటారు. నా కుటుంబ సభ్యుల సహకారం జీవితంలో మరిచిపోలేను. మా నాన్నే నా జీవితం. మా ఇద్దరి మధ్య చాలా ఫన్నీ సంభాషణలు జరుగుతాయి. నాకు, నాన్నకు మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఎప్పడు ఉంటుంది. మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నాతో ఎంతో సరదాగా ఉండేది. అప్పుడప్పుడు నువ్వే నా భర్త అనేదాన్ని. తన గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటా' అని అన్నారు.

విశాల్‌తో అభినయ పెళ్లి?

ఈ వార్త విని షాకింగ్ గురైనట్లు అభినయ వెల్లడించింది. నేను ఆయనను చూసి నవ్వడం వల్లే ఇలాంటి వార్తలొచ్చాయి. ఒక ఈవెంట్‌లో యాంకర్‌ మాట్లాడుతూ దీని గురించి అడిగింది. ఏదో యూట్యూబ్‌లో చూసి ఆమె అలా మాట్లాడింది. కానీ నాకు ఇప్పుడైతే పెళ్లి గురించి ఆలోచన లేదు. నా తల్లిదండ్రులే నాకు అన్నీ కూడా.  నేను పెళ్లి చేసుకునే వ్యక్తి ఫస్ట్ నన్ను అర్థం చేసుకోవాలి. ప్రతి విషయాన్ని షేర్ చేయాలి. రిలేషన్‌లో విలువలు ఉండాలి. అలాంటి అబ్బాయి దొరికితే పెళ్లి గురించి ఆలోచిస్తానని అభినయం అంటోంది.  

(ఇది చదవండి: టాలీవుడ్ హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు)

మరిన్ని వార్తలు