ఈ ఫొటోలోని చిన్నారి ఇప్పటి స్టార్‌ హీరోయిన్‌.. గుర్తుపట్టారా?

19 Aug, 2021 17:12 IST|Sakshi

ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు ఆమె స్టార్‌ హీరోయిన్‌

ఈ మధ్యకాలం సెలబ్రెటీలకు సంబంధించిన చిన్ననాటి ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైన సినీ తారలు వ్యక్తిగత విషయాలను, చిన్ననాటి మధుర జ్ఞపకాలను అభిమానులతో పంచుకుంటూ ఫొటోలను షేర్‌ చేశారు. ఈ క్రమంలో లాక్‌డౌన్‌లో రష్మిక మందన్నా, సాయి పల్లవి, కాజల్‌ల చిన్ననాటి ఫొటోలు హల్‌చల్‌ చేయగా.. ఇప్పటికీ పలువురు హీరోహీరోయిన్ల త్రోబ్యాక్‌ ఫొటోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ చిన్నారి ఫొటో బయటకు వచ్చింది.

ప్రస్తుతం ఆమె ఫొటో సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎరుపు రంగు చీర కట్టుకుని, ఆభరణాలతో అలంకరించుకున్న ఈ చిన్నారి ఎవరాని గుర్తు పట్టలేక నెటిజన్లు ఆలోచనలో పడిపోడుతున్నారు. ఇంతకి ఆమె ఎవరా అని మీరు కూడా ఆలోచిస్తున్నారా?. ఈ చిన్నారి మరేవరో కాదు ‘ఏమో..అదంతే నాకలా తెలిసిపోతుంది’ అంటూ సితమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టులో అలరించిన మన తెలుగమ్మాయి, టాలీవుడ్‌ హీరోయిన్‌ అంజలి. ఇటీవల పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వకిల్‌ సాబ్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్‌ హిట్‌ అందుకున్న అంజలి తెలుగు, తమిళంలో బిజీ హీరోయిన్‌గా అయిపోయింది. 

ఒ‍క తెలుగమ్మాయి పరిశ్రమలో రాణించడమంటే సాధారణ విషయం కాదు. ‘ఫొటో’ మూవీతో తెలుగు తెరపై మెరిసిన అంజలి తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘షాపింగ్‌ మాల్‌, ‘గితాంజలి’ వంటి చిత్రాలతో అలరించిన ఆమె వెంకటేష్‌, బాలకృష్ణ స్టార్‌ హీరోల సరసన నటించింది. తనదైన నటనతో పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఆమె అప్పడుప్పడు స్పెషల్‌ సాంగ్‌లో కూడా కాలు కదిపింది. ఈ క్రమంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు కాస్తా బ్రేక్‌ ఇచ్చిన అంజలి.. చాలా గ్యాప్‌ తర్వాత పవన్‌ కల్యాణ్‌ ‘వకిల్‌ సాబ్‌ మూవీ’తో రీఎంట్రీ ఇచ్చి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో అంజలి ఫుల్‌ బిజీగా మారిపోయింది. 

మరిన్ని వార్తలు