దక్షిణాది చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

21 Aug, 2021 16:11 IST|Sakshi

దక్షిణాది చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటి నల్లెనై చిత్ర (56) శనివారం ఉదయం చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. శనివారం సాయంత్రం 4 గంటలకు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. చిత్ర మృతిపై పలువురు కోలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.
(చదవండి: త్వరలోనే ఆ కల నెరవేరబోతుంది: మంచు విష్ణు)

కేరళలోని కొచ్చిలో జన్మించిన చిత్ర బాల నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. 1980-90 మధ్య కాలంలో పలు కన్నడ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటించారు. వడక్కన్ వీరగాథ, పరంపర, కలిక్కలం, రాజవచ్చ తదితర మలయాళ చిత్రాలు నటిగా ఆమెకు మంచి గుర్తింపును తెచ్చాయి. ఇటీవల సినిమాలకు దూరమైన ఆమె.. తమిళ సీరియల్స్‌తో బిజీ అయిపోయారు. ఆమెకు భర్త విజయరాఘవన్,  కుమార్తె మహాలక్ష్మి ఉన్నారు.

మరిన్ని వార్తలు