బాడీషేమింగ్‌: నెటిజన్లపై ‘జెర్సీ’ నటి ఫైర్‌

11 Jun, 2021 20:21 IST|Sakshi

బాలనటిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం నటిగా గుర్తింపు పొందింది మలయాళి భామ సనూష. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ‘బంగారం’ మూవీతో తెలుగు తెరకు  పరిచమైన సనూష ఆ తర్వాత ‘రేణిగుంట’, ‘జీనియస్‌’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా కాస్తా బొద్దుగా ముద్దుగా ఉండే సనూష ఈ మధ్య ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టి నాజుగ్గా తయారైంది. ఈ నేపథ్యంలో తన ఫొటోషూట్‌లో భాగంగా ఫోజులిచ్చిన కొన్ని ఫొటోలను సోషల్‌ మీడియా షేర్‌ చేసింది. దీంతో నెటిజన్లు ఆమె శరీరాకృతిపై విమర్శలు చేస్తూ..అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు.

అవి చూసిన సనూష నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకరిని అనే ముందు మీరేంటో తెలుసుకొండని, మీరేం అంత పర్‌ఫెక్ట్‌ కాదంటూ తనపై నెగిటివ్‌ కామెంట్స్‌ చేసిన నెటిజన్లకు చురకలు అట్టించింది. ‘నా శరీర బరువు గురించి నాకంటే ఎక్కువగా బాధపడుతున్న వారందరికి నేను చెప్పేది ఒకటే. ఎదుటి వాళ వైపు వేలెత్తి  చూపిస్తే మిగిలిన వేళ్లు మిమ్మల్ని చూపిస్తాయని గుర్తు పెట్టుకొండి. కాబట్టి ఎదుటి వాళ్లను అనే ముందు ఒక్కసారి మీరెంత పర్‌ఫెక్ట్‌గా ఉన్నారో ఆలోచించుకోండి’ అంటూ విమర్శకులకు ఘాటుగా సమాధానం ఇచ్చింది. కాగా సనూష హీరో నాని జర్సీ మూవీలో జర్నలిస్టు పాత్రలో కనిపించింది.

మరిన్ని వార్తలు