నేను ప్రేమలో ఉన్నా.. సురేఖ వాణి షాకింగ్‌ పోస్ట్

3 Apr, 2021 13:24 IST|Sakshi

టాలీవుడ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి తెరపై పోషించే పాత్రలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. కామెడీ పాత్రతైనా, ఎమోషనల్‌ పాత్రలైనా తనదైన నటనతో మెప్పించగలదు.  హీరోహీరోయిన్లకి అక్కగా, వదినగా, అత్తగా ఇలా ఎన్నో పాత్రల్లో నటించి టాలీవుడ్‌లో తనకంటూ ఓప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అయితే తెరపై ఎక్కువగా సాంప్రదాయబద్దమైన పాత్రల్లో కనిపించే సురేఖ వాణి.. రియల్‌ లైఫ్‌లో మాత్రం ఎక్కువగా ట్రెడిషినల్‌ లుక్‌లోనే కనిపిస్తుంటారు. 

ఇక సోషల్‌ మీడియాలో ఆమె చేసే రచ్చ మాములుగా ఉండదు. కూతురు సుప్రితతో కలిసి పొట్టి దుస్తులు వేస్తూ అందాలు ఆరబోస్తుంటారు. వీరిద్దరి ఫోటోలు వైరల్‌ అయి, చివరకు ట్రోల్‌ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటిపై తల్లీ కూతురు ఘాటుగానే స్పందిస్తుంటారు. తాజాగా సురేఖ వాణి సోషల్‌ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్‌ వైరల్‌ అయింది.  ఇందులో తన ఇష్టాన్ని బయట పెట్టేసింది. తాను ప్రేమలో ఉన్నాననిచెప్పింది. అయితే ఆ ప్రేమ వ్యక్తులపై కాదు, ఆమె మెడకు ధరించిన నెక్లెస్‌తో లవ్‌లో ఉంది. ఈ విషయాన్నే సురేఖా వాణి చెబుతూ.. నెక్లెస్‌తో ప్రేమలో ఉన్నాను అని పేర్కొంది. ప్రస్తుతం సురేఖా వాణి పోస్ట్ వైరల్ అవుతోంది.

 

మరిన్ని వార్తలు