కవిత్వం చెప్పగలడు

18 Nov, 2023 02:41 IST|Sakshi
మూల విరాట్

మూల విరాట్, పద్మ, రాజ్‌కుమార్, స్వప్న ముఖ్య తారలుగా ప్రభాకర్‌ జైనీ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’. ప్రముఖ కవి కాళోజీ నారాయణ బయోపిక్‌గా విజయలక్ష్మీ జైనీ నిర్మించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్‌ విడుదల వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నటుడు, దర్శక–నిర్మాత ఆర్‌. నారాయణ మూర్తి, తెలంగాణ సాంస్కృతిక సంచాలకుడు మామిడి హరికృష్ణ, నిర్మాత రామసత్యనారాయణ, దర్శకులు వీయన్‌ ఆదిత్య, వేణు ఊడుగుల సినిమా హిట్టవ్వాలన్నారు.  

ప్రభాకర్‌ జైనీ మాట్లాడుతూ– ‘‘ఒక రిక్షావాడు కూడా కవిత్వం చెప్పగలడని ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు. ‘‘కాళోజీగారి ఆత్మ నా ద్వారా ప్రేక్షకులకు పరిచయమవుతున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు కాళోజీ పాత్రధారి మూల విరాట్‌.

మరిన్ని వార్తలు