Tanushree Dutta: ‘మీ టూ’.. తప్పు లేకపోతే ఇప్పటికి నన్నేందుకు వేధిస్తున్నారు?

21 Jul, 2022 12:56 IST|Sakshi

బాలీవుడ్‌ నటి, హీరోయిన్‌ దనుశ్రీ దత్త పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆమె పేరు వినగానే ముందుగా గుర్తోచ్చేది ‘మీ టూ’ ఉద్యమం. 2018లో సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన మీటూ ఉద్యామానికి తెరలేపింది ఆమె. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌ తనని శారీరంగా వేధించాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఆమె తర్వాతా వెంటనే పలువురు నటీమణులు కూడా బయటకు వచ్చి తమకు ఎదురైన చేదు అనుభావాలను పంచుకున్నారు. దీంతో మీ టూ దేశ్యవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా మరోసారి ఆమె మీ టూపై స్పందించింది. రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రీఫ్‌ నోట్‌ షేర్‌ చేసింది.

చదవండి: విషాదం.. క్యాన్సర్‌తో టీవీ నటి మృతి

ఈ  సందర్భంగా ఆమె.. లైంగిక వేధింపులపై మాట్లాడినందకు ఇప్పటికీ తనని వేధిస్తున్నారని ఆరోపించింది. ‘మీటూ నిందితులు నాకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు. నా కెరీర్‌రను నాశనం చేయాలని వారు కంకణం కట్టుకున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చిత్ర పరిశ్రమను వదిలి వెళ్లిపోను. మళ్లీ నటిగా కొత్త జీవితం ప్రారంభిస్తాను’ అని పేర్కొంది. అలాగే బాలీవుడ్‌పై మహారాష్ట్ర పాత ప్రభుత్వం ప్రభావం ఎలా ఉందో ఈ సందర్భంగా వివరించింది. ‘బాలీవుడ్ మాఫియా, మహారాష్ట్రలోని పాత పొలిటికల్ సర్క్యూట్ (ఇప్పటికీ ప్రభావం ఉంది) దుర్మార్గపు జాతీయ-వ్యతిరేక క్రిమినల్ ఎలిమెంట్స్ కలిసి సాధారణంగా ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఇలా పనిచేస్తాయి. వీటన్నింటి వెనుక నేను బయటపెట్టిన #metoo నేరస్థులు, NGO వారే ఉన్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

చదవండి: మరోసారి తల్లికాబోతున్న ఐశ్వర్య?.. వీడియో వైరల్‌

ఎందుకంటే వారి తప్పు లేనప్పుడు ఇంకా నన్ను ఎందుకు టార్గెట్ చేసి వేధిస్తారు?? అంతేకాదు చాలా మంది నన్ను బాలీవుడ్‌లో లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని నాకు తెలుసు. నన్ను టార్గెట్ చేసి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడినందుకు చిన్నపిల్లలు, అమ్మాయిలను వేధించి చంపగలిగే ప్రదేశం ఇది ఏమిటి?? ఇక్కడ విషయాలు నిజంగా చేయి దాటిపోతున్నాయి. నాలాంటి సాధారణ వ్యక్తులు జీవించలేని పరిస్థితులు ఉన్నాయి. దాని బాధితులుగా ఈరోజు నేను.. రేపు నువ్వు కూడా కావచ్చు’ అంటూ ఆమె రాసుకొచ్చింది. అయితే ఇన్ని సమస్యలు, ఎంతమంది తనని ఇబ్బంది పెట్టాలని చూసిని తాను మాత్రం భయపడనని, ఆత్మహత్య లాంటివి చేసుకోను అంటూ హామి ఇచ్చింది. వీటన్నింటి ఎదురు నిలబడేందుకు నా ఆత్మ స్థైర్యాన్ని పెంచుకుంటానని, అందుకోసం ఆధ్యాత్మిక సాధనను మరింత బలోపేతం చేసుకుంటున్నట్లు ఆమె చెప్పింది. 

A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial)

మరిన్ని వార్తలు