Rakhi Sawant: 'నాతో ఉంటూ మాజీ భర్తతో సీక్రెట్‌గా'.. ఆదిల్ సంచలన కామెంట్స్!

21 Aug, 2023 17:16 IST|Sakshi

బాలీవుడ్ భామ రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల సోషల్ మీడియాలో విచిత్రమైన రీల్స్ చేస్తూ సందడి చేస్తోంది. అయితే ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలతో తీవ్రమైన ఒత్తిడికి గురైన రాఖీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. గతంలో ఆమె తన భర్త ఆదిల్‌ ఖాన్ దురానీ విడాకులు, ఆ తర్వాత అమ్మ మరణంతో ఆమె పరిస్థితి అయోమయంగా తయారైంది.  రాఖీ సావంత్ తన మాజీ భర్త ఆదిల్‌పై కేసు పెట్టడంతో రిమాండ్‌కు వెళ్లి వచ్చారు. అయితే తాజాగా ఆదిల్.. ఆమె గురించి సంచలన కామెంట్స్ చేశారు. తనపై అన్యాయంగా అత్యాచారం కేసు పెట్టిందని వాపోయాడు. 

జైలు  నుంచి బయటకొచ్చిన తర్వాత ఆదిల్ మొదటిసారి మీడియాతో  మాట్లాడారు. ఈ సందర్భంగా తన మాజీ భార్య రాఖీ సావంత్‌పై  తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఆమె చాలా ప్రమాదకరమైన మహిళ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాఖీ సావంత్‌కు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి తనను మోసం చేసిందని ఆరోపించాడు. రితేష్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోలేదని అన్నాడు. 

(ఇది చదవండి: నేను పెళ్లి చేసుకుంటానంటే పిల్లలు వద్దంటున్నారు: సుష్మితా సేన్‌)

ఆదిల్ మాట్లాడుతూ.. 'ఆమెతో మాట్లాడటం కూడా చాలా ప్రమాదకరం. ఎందుకంటే మహిళలు ఏదైనా చేయగలరు. ఎందుకంటే  'రేప్' అని అరిచినా మమ్మల్ని అరెస్టు చేసే విధంగా మన రాజ్యాంగం మహిళలకు రక్షణ క ల్పిస్తోంది. అంతే కాకుండా  రితేష్‌తో కలిసి రాఖీ నన్ను మోసం చేసింది. అతనితో పెళ్లైన విషయాన్ని రాఖీ దాచిపెట్టి.. విడాకులు తీసుకోకుండానే నాతో రిలేషన్ కొనసాగించింది. తనతో ఉంటూనే మాజీతో బంధాన్ని కొనసాగించింది. యూకే వర్క్ టూర్‌ గురించి సీక్రెట్‌గా రితేష్‌కి ఆమె మేసేజెస్ పంపింది. ' అంటూ ఘాటు విమర్శలు చేశారు.

 అంతే కాకుండా శారీరకంగా తనను హింసించిందని వాపోయారు.  అతని శరీరంపై గాయాలను చూపిస్తూ ఒక వీడియో రికార్డింగ్‌ను ప్రదర్శించాడు. ఆమెను తాను వేధించినట్లు చెప్పిందంతా అబద్ధమని కొట్టిపారేశాడు. వయసులో ఆమె కంటే చిన్నవాడిని అయినప్పటికీ దుబాయ్‌లో ఆమె కోసం రూ.2.8 కోట్లు ఖర్చు పెట్టినట్లు వెల్లడించాడు. దుబాయ్‌లో  ఓ ఫ్లాట్, బీఎండబ్లూ కారు, నగలతో పాటు ఖరీదైన బహుమతులు కొనిచ్చినట్లు తెలిపాడు.  అంతే కాకుండా రాఖీ నాకు తెలియకుండానే అకౌంట్‌ నుంచి రూ1.5 కోట్లు విత్‌డ్రా చేసిందని ఆరోపించాడు. 

తనపై తప్పుడు కేసు

తనపై తప్పుడు ఆరోపణలతో అత్యాచారం కేసులో పెట్టిందని ఆదిల్ వెల్లడించాడు.  ఆమె వల్ల నా జీవితం గందరగోళంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.  రాఖీకి వ్యతిరేకంగా నటి షెర్లిన్ చోప్రా చేసిన కామెంట్స్‌ నిజమేనన్నారు.  ఆమె వలలోకి మరొక వ్యక్తి బలి కాకుండా ఉండాలనేదే తన సంకల్పం అన్నారు. 

అసభ్యకరమైన వీడియో తీసి..

రాఖీ సావంత్ తనకు డ్రగ్స్ అలవాటు చేసి.. న్యూడ్ వీడియో తీసిందని  ఆదిల్ ఆరోపించాడు. అంతే కాకుండా తన తల్లికి క్యాన్సర్ పేరుతో ప్రజలను దోచుకుందని విమర్శలు చేశారు. తల్లికి ఆరోగ్యం బాలేదని  ప్రతి నెలా ఒకటి నుంచి రెండు లక్షల రూపాయల వరకు విరాళాలు సేకరించేదని ఆదిల్ ఖాన్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆదిల్ చేసిన కామెంట్స్ బీటౌన్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. 
 

(ఇది చదవండి: ఉన్నదంతా దానం చేసిన కమెడియన్‌.. చివరిరోజుల్లో తిండి లేక చనిపోయింది!)

మరిన్ని వార్తలు