ప్రేమలో ఉన్నానంటోన్న అడివి శేష్‌!

3 Jun, 2021 15:22 IST|Sakshi

మూస పద్ధతిలో ఉండే సినిమాలకు ఆమడ దూరంలో ఉండే హీరో అడివి శేష్‌. కథలో కొత్తదనం ఉంటేనే సినిమాకు సంతకం చేసే ఈ హీరో తన కెరీర్‌లో తక్కువ విజయాలనే సొంతం చేసుకున్నప్పటికీ యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. వైవిధ్యభరితమైన సినిమాలకు కేరాఫ్‌గా మారిన ఈ టాలెంటెడ్‌ హీరో ప్రస్తుతం 'మేజర్‌', 'హిట్‌ 2' సినిమాలు చేస్తున్నాడు. తాజాగా అతడు ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆంగ్లమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఓ హైదరాబాదీ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు అంగీకరించాడు. కాకపోతే ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని పేర్కొన్నాడు. ఆమె గురించి పూర్తి వివరాలు చెప్పేందుకు ప్రేయసి దగ్గర అనుమతి తీసుకోలేదని, కాబట్టి ఇప్పుడు తన గురించి ఏమీ చెప్పడానికి కుదరదని తేల్చి చెప్పాడు. దీంతో అడివి శేష్‌ తన ప్రేయసిని ఎప్పుడు పరిచయం చేస్తాడా? అని అభిమానులు తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

కాగా అడివి శేష్‌ ఆ మధ్య కోవిడ్‌ పేషెంట్లు చికిత్స పొందుతున్న కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన విషయం తెలిసిందే. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని సొంత ఖర్చుతో వాటర్‌ ప్యూరిఫికేషన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయించి అందరి మన్ననలు పొందాడు.

చదవండి: రెండో హిట్‌ కేసు ఆరంభం

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి.. మోస్ట్‌ డిజైరబుల్‌ మ్యాన్‌

మరిన్ని వార్తలు