బిచ్చగాడు-2 కోసం ప్రాణం పెట్టారు : అడివి శేష్‌

18 May, 2023 08:11 IST|Sakshi

‘‘సినిమా కోసం ప్రాణం పెట్టి చేశామని అందరూ చెబుతుంటారు. కానీ, ‘బిచ్చగాడు 2’ కోసం విజయ్, ఫాతిమాగార్లు నిజంగా ప్రాణం పెట్టి పనిచేశారు. వారికోసమైనా ‘బిచ్చగాడు 2’ హిట్టవ్వాలి’’ అన్నారు హీరో అడివి శేష్‌. విజయ్‌ ఆంటోని హీరోగా నటించి, దర్శకత్వం వహించడంతో పాటు సంగీతమందింన త్రం ‘బిచ్చగాడు 2’. కావ్యా థాపర్‌ హీరోయిన్‌. ఫాతిమా విజయ్‌ ఆంటోని నిర్మింన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రేపు (శుక్రవారం) విడుదలవుతోంది.

కాగా తెలుగులో ఈ చిత్రాన్ని ఉషా పిక్చర్స్‌పై విజయ్‌ కుమార్, వీరనాయుడు రిలీజ్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకకి హీరోలు అడివి శేష్, ఆకాశ్‌ పూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆకాశ్‌ పూరి మాట్లాడుతూ– ‘‘విజయ్‌ ఆంటోనిగారిని ఇంతవరకు ప్రేమిస్తూ వచ్చాను.. కానీ ఆయన్ను కలిశాక గౌరవం మొదలైంది.

‘బిచ్చగాడు 2’ పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు. విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ– ‘‘బిచ్చగాడు’ తొలి భాగం నచ్చినవారికి రెండో భాగం కూడా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘నేనీ సినిమాకు కేవలం నిర్మాతను మాత్రమే. అన్నీ మా ఆయన (విజయ్‌ ఆంటోని) చూసుకున్నారు. ఆయన ప్రమాదానికి గురైనా.. అభిమానుల ప్రేమ వల్లే కోలుకున్నారు’’ అన్నారు ఫాతిమా విజయ్‌ ఆంటోని. 

మరిన్ని వార్తలు