కోబ్రాలో విక్రమ్‌ గెటప్స్‌ ఎన్నో తెలుసా?

27 Jul, 2020 09:18 IST|Sakshi

తమిళ హీరో చియాన్‌ విక్రమ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కోబ్రా. ఇంతకు ముందు డిమాండ్‌ కాలనీ, ఇమైకా నొడిగల్‌ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న భారీ చిత్రం కోబ్రా. 7 స్క్రీన్‌ స్టూడియో పతాకంపై లలిత్‌కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణను పూర్తి చేసుకుంది. కాగా, లాక్‌డౌన్‌ తర్వాత మిగిలిన షూటింగ్‌ పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. అయితే ఈ చిత్రంలోని కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలిశాయి. ముఖ్యంగా ప్రముఖ క్రికెట్‌ క్రీడాకారుడు ఇర్ఫాన్‌ పఠాన్‌ ముఖ్య పాత్రల్లో నటుడిగా పరిచయం కాబోతున్నాడు. ఆయన్ని పరిచయం చేయడం గురించి దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు తెలుపుతూ.. ఈ చిత్రంలో ఇంటర్‌పోల్‌ అధికారి పాత్ర ఉందన్నారు. దాన్ని ప్రజలకు చాలా పరిచయమైన వ్యక్తితో నటింపజేయాలని భావించినట్లు తెలిపారు. అప్పుడే ఆ పాత్ర స్ట్రాంగ్‌ గా ఉంటుందని అని భావించినట్లు చెప్పారు. ఆ పాత్రకు ఎవరిని ఎంపిక చేయాలా అని ఆలోచిస్తున్న తరుణంలో ఐర్ఫాన్‌ పఠాన్‌ టిక్‌టాక్‌ వీడియోను చూశానని చెప్పారు.

ఐర్ఫాన్‌ పఠాన్‌ను కోబ్రా చిత్రంలో నటింపచేస్తే బాగుంటుందన్న ఆలోచన చిత్ర యూనిట్‌కు వచ్చిందని జ్ఞానముత్తు అన్నారు. దీంతో ఇర్ఫాన్‌ను కలవగా ముందు నటించడానికి సంకోచించినా ఆ తర్వాత ఒప్పుకున్నారని చెప్పారు. ఇందులో నటుడు విక్రమ్‌ కనిపించనున్న గెటప్‌ల గురించి కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. కోబ్రా చిత్రంలో విక్రమ్‌ 20 గెటప్పుల్లో కనిపించనట్లు చిత్రవర్గాలు పేర్కొన్నారు. ఇది సైకలాజికల్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందుతున్న కథా చిత్రం కావడంతో హీరోకు ఇన్ని గెటప్‌లు అవసరం అయ్యాయి అంటున్నారు. దీంతో కోబ్రా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా చిత్రంలోని విక్రమ్‌ గెటప్‌లు ఒక్కొక్కటీ వరుసగా విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు చెప్పారు. అందులో భాగంగా ఇటీవల ఒక గెటప్‌ను విడుదల విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా