Akkineni Amala: అక్కినేని అమల 'కణం' సినిమా విడుదల ఆరోజే..!

10 Aug, 2022 07:40 IST|Sakshi

Akkineni Amala Kanam Movie Release Date Out: వైవిధ్య భరిత కథా చిత్రాల నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌. ఈ సంస్థ అధినేతలు ఎస్‌ఆర్‌ ప్రభు, ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు తాజాగా నిర్మిస్తున్న చిత్రం 'కణం'. నటి అమల అక్కినేని, శర్వానంద్‌, రీతూవర్మ, నాజర్, సతీష్, రమేష్‌ తిలక్, ఎమ్మెస్‌ భాస్కర్‌ తదితరులు ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్‌ అనే దర్శకుడు పరిచయం అవుతున్నారు. దీనికి సుజిత్‌ సరాంగ్‌ ఛాయాగ్రహణం, జాక్స్‌ బిజాయ్‌ సంగీతం అందిస్తున్నారు. 

ఇది వైవిధ్యభరిత చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని మంగళవారం (ఆగస్టు 9) మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమని, గ్రాఫిక్స్‌పై ప్రత్యేక దృష్టి సారించిట్లు తెలిపారు. ఇటీవల విడుదలైన చిత్రంలోని అమ్మ పాటకు, టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చిందన్నారు. ద్విభాషా చిత్రంగా సెప్టెంబర్‌ 9వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తమిళంలో 'కణం' పేరుతోనూ, తెలుగులో 'ఒకే ఒక జీవితం' పేరుతో ప్రేక్షకులకు ముందుకు తీసుకొస్తామన్నారు.   

చదవండి: కారు ప్రమాదం, కోమాలోకి వెళ్లిన నటి
సినిమా రిలీజ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు: అమలా పాల్‌

Akkineni Amala Kanam Movie Release Date News

మరిన్ని వార్తలు