Ram Setu Movie OTT Release: ఓటీటీకి వచ్చేస్తున్న రామ్ సేతు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

21 Dec, 2022 17:48 IST|Sakshi

అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన చిత్రం ‘రామ్‌ సేతు’. రామ్‌ సేతు విశిష్టత, దాన్ని రక్షించేందుకు ఆర్కియాలజిస్ట్ చేసే సాహసోపేతమైన జర్నీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో యంగ్‌ అండ్‌ టాలెంట్‌ హీరో సత్యదేవ్‌ మరో కీలక పాత్ర పోషించారు. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, నుస్రత్‌ బరూచా హీరోయిన్లుగా నటించారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 25 విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. డిసెంబర్‌ 23 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ఫ్రైమ్‌ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానున్నట్లు చిత్రబృందం తెలిపింది. అయితే ఈ సినిమాను ఉచితంగా చూసేందుకు అవకాశం కల్పించింది. 

‘రామ్‌ సేతు’ కథేంటంటే..': ప్రముఖ వ్యాపారవేత్త ఇంద్రకాంత్ (నాజర్) రామసేతును నాశనం చేస్తూ.. సేతుసముద్రం పేరుతో ఒక ప్రాజెక్ట్‌ను నిర్మించాలని నిర్ణయించుకుంటాడు. ఇది జరగాలంటే భారతీయులు విశ్వసిస్తున్నట్లు  రామసేతును శ్రీరాముడు నిర్మించలేదని, అది సహజసిద్దంగా ఏర్పడిందని నిరూపించాలి. దీని కోసం  భారత్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్కియాలజిస్ట్‌, పురావస్తు శాఖ జాయింట్ డైరెక్టర్‌ ఆర్యన్‌(అక్షయ్‌ కుమార్‌)తో ఓ రిపోర్ట్‌ని ఇప్పిస్తాడు. దీంతో అర్యన్‌కు లేనిపోని చిక్కులు వచ్చిపడతాయి. ఆయన ఇచ్చిన తప్పుడు రిపోర్ట్‌ కారణంగా ఉద్యోగం కూడా కోల్పోతాడు.

అయితే రామసేతు మీద మరింత పరిశోధన చేయమని, అన్ని విధాలుగా తోడుగా ఉంటానని ఇంద్రకాంత్‌ హామీ ఇవ్వడంతో ఆర్యన్‌ వారి టీమ్‌లో చేరిపోతాడు. రామసేతు మీద పూర్తిగా పరిశోధించేందుకు వెళ్లిన ఆర్యన్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? ఆర్యన్‌ టీమ్‌ ఎందుకు శ్రీలంకకు వెళ్లాల్సి వచ్చింది? ఇంద్రకాంత్‌ వేసిన ప్లాన్‌ ఏంటి? శ్రీలంక ప్రయాణంలో ఆర్యన్‌ టీమ్‌కు ఏపీ(సత్యదేవ్‌)ఎలాంటి సహాయం చేశాడు. గైడ్‌గా చెప్పుకున్న ఏపీ ఎవరు? చివరకు ఆర్యన్‌ ‘రామసేతు’పై ఆధారలతో సహా ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్‌ ఏంటి? అనేదే మిగతా కథ. ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్సయిన వారు ఓటీటీ చూసి ఎంజాయ్ చేయండి. 


 

మరిన్ని వార్తలు