‘పుష్ప’టీమ్‌కు షాక్‌.. రెండు సీన్లు లీక్‌

3 Feb, 2021 14:20 IST|Sakshi

ఒక భారీ సినిమా తెరకెక్కుతున్నప్పుడు ఎలాంటి సన్నివేశాలు లీకవకుండా చాలా కేర్‌ఫుల్‌గా ఉంటుంది చిత్ర యూనిట్‌. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎవరో ఒకరు సన్నివేశాలను రహస్యంగా ఫోన్ కెమెరాలో షూట్ చేసి లీక్ చేసేస్తుంటారు. ఇప్పుడు స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప’కు అలాంటి పరిస్థితే ఎదురైంది. ఈ సినిమా నుంచి తాజాగా రెండు సన్నివేశాలు లీకయ్యాయి. అందులో ఒకటి బన్నీ, రష్మికల మధ్య వచ్చే మెలోడీ సాంగ్‌, మరొకటి పోలీసులకు, అల్లు అర్జున్‌లకు మధ్య జరిగే ఫైట్‌ సీన్‌.

ఈ రెండు సీన్లకు సంబంధించిన క్లిప్పింగులుచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెట్స్ పైకొచ్చిన మొదటి రోజు నుంచి ఈ సినిమా లీకుల బారిన పడుతూనే ఉంది. తాజాగా ఇలా ఒకేసారి రెండు సీన్లు లీక్ అవ్వడం యూనిట్ కు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది.

కాగా, పుష్ప సినిమాను ఔట్ డోర్ లో షూట్ చేస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్‌ పుష్పరాజ్‌గా బన్నీ కనిపించనున్నాడు. షూటింగ్ కోసం వచ్చిన జనాల్లో ఎవరో ఒకరు తమ మొబైల్ లో వీడియో తీసి వైరల్‌ చేసినట్లు తెలుస్తోంది. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఆగస్టు 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

మరిన్ని వార్తలు