Rashmika Mandanna: రష్మిక మందన్నా 'గుడ్‌ బై' అప్పుడే !

24 Jul, 2022 18:23 IST|Sakshi

కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా (Rashmika Mandanna) వరుస సినిమాలు చేస్తూ తగ్గేదే లే అంటోంది. టాలీవుడ్‌తో స్టార్‌డమ్‌ సంపాందించుకున్న ఈ అమ్మడు కోలీవుడ్, బాలీవుడ్‌లో ఫుల్‌ బిజీగా ఉంది. 'పుష్ప' మూవీతో తెలుగు, తమిళం, హిందీ ఆడియెన్స్‌ల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్‌లో విజయ్ నటిస్తున్న 'వారీసు' (వారసుడు) చిత్రంలో నటిస్తోంది. అలాగే 'పుష్ప 2'తోపాటు మరికొన్ని హిందీ, కోలీవుడ్ ప్రాజెక్టులు చేస్తోంది. 

ఇక హిందీలో చేసిన 'మిషన్‌ మజ్ను', 'గుడ్‌ బై' సినిమాల చిత్రీకరణ పూర్తి అయింది. తాజాగా 'గుడ్‌ బై' సినిమా విడుదల తేదిని ఖరారు చేసింది మూవీ యూనిట్. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, నీనా గుప్తా, ఎల్లీ అవ్రాం, సునీల్‌ గ్రోవర్, సాహిల్ మెహతా తదితరులు కీలక పాత్రల్లో అలరించనున్నారు. ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా అక్టోబర్‌ 7న విడుదల కానుంది. ఏక్తా కపూర్ నిర్మించిన ఈ సినిమాకు వికాస్‌ బహల్‌ దర్శకత్వం వహించారు. అంత్యక్రియల చుట్టూ 'గుడ్‌ బై' మూవీ కథ జరుగుతుందని బాలీవుడ్‌ మీడియా అంటోంది. 

చదవండి: నూలుపోగు లేకుండా రణ్‌వీర్‌ సింగ్‌.. మానసిక రోగి అంటూ బ్యానర్లు
కేటీఆర్‌ గారూ.. త్వరగా కోలుకోవాలంటే ఈ చిత్రం చూడండి..


చదవండి: జాన్వీకి తల్లి శ్రీదేవి చెప్పిన బ్యూటీ సీక్రెట్‌ ఇదే..

మరిన్ని వార్తలు