నా కొడుకువైనందుకు గర్వంగా ఉంది: అమితాబ్‌

20 Nov, 2021 15:04 IST|Sakshi

Amitabh Bachchan Showered Abhishek Bachchan: బాలీవుడ్‌ హీరో అభిషేక్ బచ్చన్ తాజా చిత్రం 'బాబ్‌ బిస్వాస్‌'. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు. క్రైమ్‌ డ్రామాగా ఆసక్తిరేకేత్తించింది ఈ సినిమా ట్రైలర్‌. రెండున్నర నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్‌ 'బాబ్‌ బిస్వాస్‌' ప్రయాణం గురించి సాగింది. ధీర్ఘకాలంగా ఉన్న కోమా నుంచి బయటకు వచ్చిన ఒక వ్యక్తి తన జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? అతనికి గుర్తు రాని వివరాలు ఏంటి? అంశాలతో ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. ఇందులో మధ్యవయస్కుడైన హిట్‌మ‍్యాన్‌ బాబ్‌ బిస్వాస్‌ పాత్రలో అభిషేక్‌ నటించారు. బాబ్‌ బిస్వాస్‌ భార్య పాత్రలో చిత్రాంగద సింగ్‌ యాక్ట్‌ చేశారు. 

ఈ ట్రైలర్‌కు విశేస స్పందన లభించింది. అభిషేక్‌ బచ్చన్‌ అభిమానులను ఎంతగానే అలరించింది ఈ ట‍్రైలర్‌. అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఈ చిత్ర ట్రైలర్‌ను బాలీవుడ్‌ మెగస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ వీక్షించారు. అది చూసి 'నువ్వు నా కొడుకువని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను' అని అభిషేక్‌ బచ్చన్‌పై ఎమోషనల్ ట్వీట్‌ చేశారు. 'మాకు బాబ్‌ బిస్వాస్‌ వంటి అద్భుతమైన బృందం దొరికింది. బాబ్‌ పాత్రలో లీనమవుతూ నటించడాన్ని పూర్తిగా ఆస్వాదించాను. నేను పని చేసిన మంచి చిత్రాల్లో ఇది ఒక్కటి. ప్రేక్షకులు కూడా ఈ సినిమాను విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను' అంటూ అభిషేక్‌ చెప్పారు. 

ఈ చిత్రం కాంట్రాక్ట్‌ కిల్లర్‌ బాబ్‌ బిస్వాస్ చుట్టూ తిరుగుతుంది. మొదట విద్యాబాలన్‌ నటించిన 'కహానీ' చిత్రంలో ఈ పాత్రను చిత్రీకరించారు. ఈ సినిమాకు దియా అన్నపూర్ణ ఘోష్‌ దర్శకత్వం వహించిగా గౌరీ ఖాన్‌, సుజోయ్‌ ఘోష్‌, గౌరవ్‌ వర్మ నిర్మించారు. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 3, 2021న జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది. 

మరిన్ని వార్తలు